Politics నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే అలాగే 8 మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే పలువురు గాయాల పాలయ్యారు.. ఈ విషయంపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ..
కందుకూరు జిల్లాలో జరిగిన సంఘటనపై తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు నరేంద్ర మోడీ.. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మృతులకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు అలాగే క్షతగాత్రులకు 50,000 మంజూరు చేశారు.. అదే ఈ సంఘటన విని దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు.. గాయపడిన వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కచ్చితంగా అందించాలని ఆదేశాలు జారీ చేశారు అలాగే ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా జాగ్రత్త పడాలంటూ చెప్పారు..
విషయంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు స్పందించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం అక్కడి నుంచి తన సంతాపాన్ని తెలియజేశారు అలాగే మృతుల కుటుంబాలకి రెండు లక్షల పరిహారాన్ని అందిస్తామని తెలిపారు అంతేకాకుండా అక్షతగాత్రులకు సైతం 50 వేలు పరిహారాన్ని అందిస్తామని చెప్పారు.. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు నేతలు స్పందించారు టిడిపి నాయకులు సైతం మృతుల కుటుంబాలకి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు అలాగే వారంతా దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లి మృతుల కుటుంబాలని స్వయంగా పలకరించారు అలాగే వారి పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్టు తరఫు నుంచి ఉచిత విద్యను అందిస్తామని భరోసా ఇచ్చారు