టాలీవుడ్ లో కొత్త కొత్త కథలతో సినిమాలు చేసేందుకు చాలా మంది దర్శకులు ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులు కూడా కొత్త కథల సినిమాలను ప్రోత్సహిస్తున్నారు, అలాంటి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ప్లే బ్యాక్. ప్రస్తుతాన్ని గతాన్ని అనుసంధానం చేస్తూ తీసిన సినిమానే ఈ ప్లే బ్యాక్ చిత్రం, 26 సంత్సరాల క్రితం జరిగిన కథను కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు హరిప్రసాద్ జక్కా, ఈ కథలో హీరో (దినేష్ తేజ) కార్తి అనే యువకుడికి జర్నలిస్ట్ కావాలని మీడియా సంస్థ (TV5) లో ఉద్యోగానికి చేరుతాడు. ఒక పాత ఇంట్లో అద్దెకి వస్తాడు, ఆ పాత ఇంట్లో ఓల్డ్ ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది. ఆ ల్యాండ్ లైన్‌తో అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంటిలో ఉన్న పాత ల్యాండ్ లైన్‌కు సుజాత (అనన్య నాగళ్ల) అనే అమ్మాయి ఫోన్ చేస్తుంటుంది…1993లో ఉన్న సుజాత.. వర్తమానంలో ఉన్న కార్తికి ఎలా కలిసింది? ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? గతంలో సుజాతకు ఏర్పడిన ప్రమాదాన్ని, వర్తమానంలో ఉన్న హీరో ఎలా పరిష్కరించగలిగాడు వంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ ప్లే బ్యాక్, చిత్రంలో నటించిన నూతన నటి నటులు తమ నటనతో సినిమాకు న్యాయం చేశారు, డైరెక్టర్ హరి ప్రసాద్ జక్కా 26 ఏళ్ళ క్రితం జరిగిన దృశ్యాలను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో టీవీ5 మూర్తి , ఇడ్రీమ్ TNR అత్భుతంగా నటించి వారి పాత్రలకు న్యాయం చేసారు. ఇలాంటి కొత్త కథలు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనడంలో సందేహం లేదు. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకర్షిస్తుంది.
నటి నటులు: దినేష్ తేజ్, అనణ్య, అర్జున్ కళ్యాణ్, మారుతి, టిఎన్ఆర్, స్పందన పల్లి..
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: హరిప్రసాద్ జక్కా
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
నిర్మాత: PNK ప్రసాద్ రావు
సినిమాటోగ్రఫీ: K బుజ్జి
https://youtu.be/5hhvWZWaJeo