Political News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కార్యకర్తలు వైసిపి కార్యకర్తలు కుప్పం వద్ద ఉద్రిక్తతలు పెంచిన విషయం అందరికీ తెలిసిందే.వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ
శుక్రవారం సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోంది. అందుకే జనమంతా వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా సీఎం జగన్ మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు మీడియాతో చెప్పడం జరిగింది.
అలానే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన చెప్పడం జరిగినది. ఎన్నికలు దగ్గర పడడంతో చంద్రబాబు నాయుడు కుప్పంలో ఉద్రిక్తలు అధికం అయ్యేలా చేస్తున్నాడని ఆయన ఎద్దేవా చేసి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా ఓడిపోతాడు అనే భయంతో ఇలా చేశారని శంకరనారాయణ వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానిదే విజయం అని చెప్పుకొచ్చారు. కుప్పం సాకుతో వైసీ జగన్ మోహన్ రెడ్డి పై నిందలు వేస్తున్నారంటూ ఆయన వాపోయారు. దీనిని అడ్డం పెట్టుకొని టిడిపి నాయకులు నిరసనలు ర్యాలీలంటూ మరో కొత్త కోణాన్ని మొదలు పెట్టారని చెప్పుకొచ్చారు. టిడిపి ప్రభుత్వం ఎన్ని నాటకాలు చేసిన వచ్చే ఎన్నికల్లో వైసిపి విజయం తథ్యం అంటూ మీడియాతో శంకరనారాయణ చెప్పడం జరిగింది.