Unstoppable 2 : నందమూరి నటసింహాం బాలకృష్ణ హోస్ట్‌గా సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ షో లో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తొలిసారి పవన్ డిజిటల్ ప్లాట్ ఫాంపై కనిపించబోతుండడంతో ఈ ఎపిసోడ్ కోసం ఆయన ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్ ని ఆహా రిలీజ్ చేసింది. బాలయ్య, పవన్ ఓకే వేదికపై ఉండడంతో మెగా, నందమూరి అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా, ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేశారు నిర్వాహకులు. పవన్ ఎంట్రీ కూడా సాలిడ్‌గా ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక పవన్‌తో బాలయ్య చేసిన సందడి అభిమానుల్ని ఆకట్టుకుంటుందని ఈ టీజర్ చూస్తే అర్దం అవుతుంది. సినిమాలు, రాజకీయాలు ఇలా అన్ని అంశాలపై బాలయ్య – పవన్‌ల మధ్య సంభాషణ జరిగింది.
టీజర్ లో ఏం ఉందంటే..
అందుకే నన్ను బాలా అని పిలవమంటానని బాలకృష్ణ చెప్పడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. దానికి పవన్ కళ్యాణ్ నేను ఓడిపోవడానికైనా సిద్దమే కాని అలా పిలవనంటారు. ఈ పాలిటిక్సే వద్దంటూ బాలయ్య అంటూ.. ఇపుడు నీ విమర్శల్లో వాడీ వేడీ డబుల్ ఇంపాక్ట్ అయింది…అని బాలయ్య అనగానే నేను చాలా పద్దతిగా మాట్లాడతానండి అంటూ పవన్ సమాధానమిచ్చారు. మీ అన్నయ్య చిరంజీవి గారి నుంచి నేర్చుకున్నవేంటి? వద్దనుకున్నవేంటి? అని బాలయ్య ప్రశ్నించడం ఈ టీజర్ లో కనిపించింది.
మరో సందర్బంలో మా వదినకు ఫోన్ చేసి ఇదే నా లాస్ట్ మూవీ అని చెప్పానని పవన్ అంటారు. రాష్ట్రంలో నీ ఫ్యాన్ కానివాడు ఎవరూ లేడు.. మరి ఈ ప్రేమ ఓట్ల రూపంలోకి ఎందుకు మారలేదు అంటూ బాలయ్య ప్రశ్నిస్తారు.. దానికి పవన్ సమాధానం మాత్రం ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి. టీజర్ చివరిలో మేము బ్యాడ్ బాయ్స్… 12345678910 అంటూ బాలయ్య చెప్పడంతో ముగుస్తుంది టీజర్. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.