Political ప్రజా సమస్యలేవైనా, ఎక్కడున్నా.. తనకు తెలిస్తే వెంటనే స్పందిస్తుంటారు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్. తనకు చేతనైన మేర సాయం చేస్తుంటారు. ఇలా… చాలా సార్లే గుప్త దానాలు చేస్తూ వచ్చిన పవన్.. ఉద్దానం వంటి తీవ్రమైన సమస్యలపై పోరాడి మరీ ప్రభుత్వాలను కదిలించారు. తాజాగా… తెలంగాణలోని ఓ సమస్యలపైనా స్పందించారు. రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థుల సమస్యల్ని అధికారుల, నాయకుల దృష్టికి తీసుకు వచ్చారు.
ఈ గ్రామాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు మేడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళుతుంటారు. సాయంత్రం ఇళ్లకు తిరిగి వచ్చేటప్పుడు బస్సులు సరిగా లేక నడుచుకుంటూ వస్తుంటారు. వీరిలో ఆడపిల్లలూ ఉంటుండగా… వాళ్ల రక్షణ, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బస్సు సౌకర్యాన్ని మెరుగు పరచాలని సూచించారు. ఈ గ్రామాలు అటవీ ప్రాంతంలోనివి కావడంతో.. రాత్రుళ్లు విద్యార్థులు ఇళ్లకు నడుచుకుంటూ వెళ్లేందుకు తీవ్రంగా భయపడుతున్నట్లు తెలిపారు. ఈ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సదుపాయం ఉన్నా సక్రమంగా నడపకపోవడం, తరచూ సర్వీసు రద్దు చేస్తుండటంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ నడిచి వెళ్తున్నారని తెలిపారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలని కోరారు. బస్సు సదుపాయం లేదనో.. అటవీ ప్రాంతంలో నడిచేందుకు భయపో విద్యార్థులు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి రాకూడదన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటూ సీఎంఓ, కేటీఆర్ ఆఫీస్‌ను జత చేస్తూ ట్వీట్ చేశారు.
విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి..
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయి. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా ఆడబిడ్డలు ..
Sri @SajjanarVC @KTRoffice @TelanganaCMO @tsrtcmdoffice pic.twitter.com/ZRrnXTpLeg— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2022