Politics వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీష్మించుకు కూర్చున్నారు ఎందుకోసం తనదైన రీతిలో వ్యూహాలు రచించుకుంటూ వెళ్తున్నారని తెలుస్తోంది..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు అలాగే ఎన్నికలు కూడా తొందరలోనే ఉన్న నేపథ్యంలో వేడుక ప్రచారం కోసం సినిమాలను ఆలోగా పూర్తి చేసేయాలని అనుకుంటున్నాట్టు తెలుస్తోంది.. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని పవన్ కళ్యాణ్ గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఆంధ్రలో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే ఆయన సభ అంటేనే చాలు జనాలు నిండిపోతారు.. గత ఎన్నికల్లో పోటీ చేసినా రెండు స్థానాల్లో ఓటమిపాలైనప్పటికీ తాను ఏమాత్రం వెనకంజ వేయనని 25 సంవత్సరాలు రాజకీయం చేయడానికే ఇక్కడికి వచ్చానని అన్నారు అలాగే ఎంతో ఓర్పుగా ఎదురుచూసే నేర్పు తన దగ్గర ఉందని ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదని తెలిపారు..
ముందు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం లేకుండా రెండు స్థానాలు నుంచి పోటీ చేయడం వల్ల ఓడిపోయానని అయితే ఈసారి ఒక స్థానం నుంచి పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు అలాగే 2024 ఎన్నికలు కాకపోతే 2029 వరకు ఎదురు చూస్తాననీ.. ప్రజలకు మేలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఇందుకోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తానని తెలిపారు అయితే తనకు ప్రజల మద్దతు మాత్రం కోరారు పవన్ కళ్యాణ్.. అలాగే గత ఎన్నికల్లో చాలా చోట్ల తక్కువ వ్యత్యాసంతోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే కొన్నిచోట్ల 2000 3000 ఓట్లు తేడాతోనే వైసీపీ చేతిలో జనసేన నాయకులు ఓడిపోయారు..