Entertainment పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హర హర వీరమల్లు పై అభిమానులు ఎన్నో అసలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు చెప్పుకొచ్చాడు దర్శకుడు..
క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాని పాత్రలో నటిస్తున్న చిత్రం హర హర వీరమల్లు ఈ సినిమా తొందరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమా ఉన్నట్టు తెలుస్తుంది.. పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. పీరియాడిక్ డ్రామాగా రానుంది చిత్రం.. పవన్ సినిమాల కంటే రాజకీయాల్లో బిజీ కావడం, హరి హర వీర మల్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి రావడంతో షూటింగ్ చాలా ఆలస్యమైంది. అలాగే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలం అయిపోయినప్పటికీ రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండి.. రావడం లేట్ అవుతూ వచ్చింది రీసెంట్గా మాత్రం రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్టు తెలుస్తుంది అలాగే ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా మారనున్నట్టు సమాచారం అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈనెల 26వ తారీఖున రాబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉండగా దీనికి సంబంధించిన కొన్ని షాట్స్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయని తెలుస్తోంది..