Political ఎన్నికల్లో పోటీ చేయటం అనేది కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమేనని ఇది ప్రాథమిక హక్కు కిందకు రాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్మానించింది.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేసిన నామినేషన్ను తిరస్కరిస్తే దాన్ని కోర్టు విచారించాల్సిన అవసరం లేదని తెలిపింది..
నామినేషన్ తిరస్కరణ అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి రాదని తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయటం అనేది ప్రాథమిక హక్కు కాదని ప్రాథమిక హక్కు కాని దేనిని కూడా విచారణ జరిపించాల్సిన అవసరం కోర్టుకు ఉండదని స్పష్టం చేసింది..
ఏపీ సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్ల సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ రెవెన్యూ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వాసుదేవరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. నామినేషన్ తిరస్కరణకు గురైనందుకు గాను ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఆయన తరపు న్యాయవాది తాతా సింగయ్యగౌడ్ ఏపీ సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్ల సంఘం కార్యదర్శి పోస్టుకు పిటిషనర్ నామినేషన్ దాఖలు చేశారని.. అయితే అన్నీ పక్కాగా ఉన్నా కూడా ఓటర్ల జాబితాలోని సీరియల్ నంబర్‌తో పేరు సరిపోలడం లేదంటూ నామినేషన్‌ను తిరస్కరించారని తెలిపారు. ఈ చర్య ద్వారా పిటిషనర్ ప్రాథమిక హక్కులను హరించారని తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వ్యక్తి నియామకం చెల్లదని, అతను సెక్షన్ ఆఫీసర్ కాదని, అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి పొందారని తెలిపారు.. ఈ కేసులో హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది..