చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ‘పారిజాత పర్వం’ కాన్సప్ట్ టీజర్ ని లాంచ్ చేశారు.
చైతన్య రావు తన కిడ్నాప్ ప్లాన్ని చెప్పడంతో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. వైవా హర్ష, మాళవిక సతీశన్ అతనిగ్యాంగ్ మెంబర్స్. కిడ్నాప్లు చేసే మరో ముఠాకు లీడర్ సునీల్. ‘కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్’ అని చెప్పడం ఇంట్రస్టింగా వుంది. శ్రద్ధాదాస్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రముఖ తారాగణం టీజర్ ద్వారా పరిచయం చేశారు. సునీల్, హర్ష మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టీజర్లో హిలేరియస్ గా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా చేశారు. రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత వినోదాన్ని పెంచింది. కాన్సప్ట్ టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది.
కాన్సప్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు( నవ్వుతూ). అంటే .. ‘కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్’ అనే చెప్పాలి. నాకు క్రైమ్ లో కామెడీ కనిపిస్తుంటుంది. ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూస్తున్నపుడు చాలా సరదాగా వుంటుంది. ‘పారిజాత పర్వం’ టీజర్ నాకు చాలా ఆసక్తికరంగా, ఎక్సయిటింగా అనిపించింది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చైతన్య, హర్ష అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ జర్నీ ఎక్కడినుంచి మొదలైయిందో తెలుసు. వాళ్ళ జర్నీని చాలా మంది ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అందుకే వారి పాత్రలని నటనని అంత ఇష్టపడుతున్నారు. చైతన్య అద్భుతమైన నటుడు. తను ఎంచుకుంటున్న పాత్రలు, సినిమాలు చాలా యూనిక్ గా ఉంటునాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.