Health బొప్పాయి పండు లో ఉన్నన్ని విటమిన్లు లేవంటున్నారు వైద్యులు ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటున్నారు.
బొప్పాయి అనగానే చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ బొప్పాయి లో ఆరోగ్యానికి మేలు చేసే చాలా గుణాలు ఉన్నాయి. బొప్పాయి ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు అన్ని పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయితో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
అంతేకాదు బొప్పాయి తినడం వల్ల చాలా రకమైన అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు.
బొప్పాయి వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి వాటిలో ముఖ్యంగా శరీరంలో టాక్సిన్స్ ను అంతం చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. కప్పు బొప్పాయి లో 62 క్యాలరీలు ఉంటాయి. ఫైబర్ తో పాటు విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
చర్మ సౌందర్యానికి బొప్పాయి ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు బొప్పాయిని ఉపయోగించి ఫేస్ మాస్క్ వేసుకుంటారు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. ఇందులో క్యాల్షియం ఉండడం వల్ల ఎముకలు ధనానికి మేలు చేస్తుంది.. అంతేకాదు బొప్పాయి గుండెకు చాలా మంచిది దీనితో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి దాదాపు అన్ని కాలాల్లో దొరుకుతుంది కాబట్టి వారంలో మూడు రోజులైనా తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు. వైరల్ ఫీవర్స్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా బొప్పాయి కాపాడుతుంది. అంతేకాదు ఒకవేళ ఆ ఫీవర్ వచ్చినా బొప్పాయి దాని నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఒక కప్పు బొప్పాయి ముక్కలు తిన్న లేదా గోరువెచ్చని నీళ్లలో బొప్పాయి ముక్కలు వేసిన నీళ్లను తాగిన బరువు తగ్గిపోతారు.