ఏయన్నార్ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మై గురు, మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబచ్చన్ గారికి ధన్యవాదాలు. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది.
పద్మ విభూషణ్, ఏయన్నార్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా హృద్యంగా జరుగుతున్నటువంటి ఈ చక్కటి సభలో మీ కరతాల ధ్వనుల మధ్య ఈ అవార్డు తీసుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. మై గురు మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబచ్చన్ గారికి ధన్యవాదాలు. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు జరిగిన సన్మాన కార్యక్రమంలో అమితాబచ్చన్ గారు ‘చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్’ సినిమా అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి ఆ మాట విని షేక్ అయ్యాను. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఐయామ్ ఓవర్ వెల్మ డ్. ఆ రోజు నేను ఆయనకి థాంక్స్ చెప్పానో లేదో కూడా తెలీదు. ఒక డిఫరెంట్ ప్లేన్ లో ఉన్నాను.
బాద్షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబచ్చన్ గారి నుంచి ఆ మాటలు రావడం ఎంతో ఆనందం. థాంక్యూ సో మచ్ బచ్చన్ జి. మీ మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మితాబచ్చన్ గారితో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది. నేను హిందీలో ప్రతిభంద్ సినిమా చేసినప్పుడు కేవలం అమితాబచ్చన్ గారికి మొదటిగా చూపించాను. ఆయన కోసం స్పెషల్ గా ప్రొజెక్షన్ వేసాం. మా ఇద్దరమే ఆ సినిమా చూశాం. సినిమా అంత చూసి ఆయన ‘వెరీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. వెరీ పర్పస్ ఫుల్ ఫిలిం. వెరీ గుడ్ జాబ్. ఆల్ ద వెరీ బెస్ట్’ అని చెప్పారు. ఆ మాటలు నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయి. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి.
అమితాబచ్చన్ గారు సైరా సినిమాలో ఒక కామియో రోల్ చేశారు. ఆయనకి ఎలా అడగాలో తెలియక ఒక చిన్న మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ చూసి వెంటనే ఆ క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ గురించి అడిగాను. ‘నీపై ఉన్న ప్రేమతో చేశాను. యు ఆర్ మై ఫ్రెండ్. ఫార్మాలిటీస్ గురించి మాట్లాడొద్దు’ అని చెప్పారు. క్షణం మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నాన. లాంగ్ లీవ్ అమితాబ్ జి. థాంక్యూ సో మచ్.
ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ప్రత్యేకంగా సన్మానించారు. హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, నాని, సిద్దు జొన్నలగడ్డ, సుధీర్ బాబు, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్, చందూమొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, శ్యాం ప్రసాద్ రెడ్డి, టీజీ విశ్వప్రసాద్, సునీల్ నారంగ్, స్వప్న దత్, హీరోయిన్స్ రమ్యకృష్ణ, శ్రీలీల, నటులు ప్రకాష్ రాజ్, మురళిమోహన్, అలీ, రాజేంద్రప్రసాద్, రైటర్ విజయేంద్రప్రసాద్, అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకు మహా అద్భుతంగా జరిగింది.