అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ఓరిదేవుడా. విక్టరీ వెంకటేశ్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించారు. దీపావళి కానుకగా అక్టోబరు 31న థియేటర్లలో విడుదలైన ఈమూవీ మంచి హిట్ టాక్ దక్కించుకుంది. ఫాంటసీ రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈమూవీలో వెంకటేశ్ దేవుడిగా సందడి చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆశ నెరవేరనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలో ఓరిదేవుడా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
సినీప్రియులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. మరికొన్ని గంటల్లో ఓరి దేవుడా సినిమా ఆహాలో అలరించనుంది. ఈరోజు (గురువారం) అర్ధరాత్రి 12 నుంచి ఓరి దేవుడా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా అభిమానులతో పంచుకుంది. ఆహా ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కు సినీప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.