పగలు, రాత్రి తేడా లేకుండా విచక్షణారహితంగా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించడము ద్వారా, పరోక్షముగా రేప్ కి కారణమై, స్థానిక ప్రజలకు ఇబ్బంది కరముగా, వ్యవహరిస్తున్న శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ గారి ఆదేశానుసారం, SHO వనస్థలిపురం విజ్ఞప్తి మేరకు సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా గారు శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ రూమ్‌ల ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) (ప్లాట్ నెం.9, H.No.7- 4-9/8,9/FF, యశోదర నగర్ కాలనీ, ఓంకార్ నగర్, బైరమల్‌గూడ, సాగర్ రోడ్ దగ్గర, సరూర్‌నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా) మూసివేతకు ఆదేశించారు.
సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించే వారిని, అసాంఘిక కార్యకలాపాలు మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలని కొనసాగించే వారిని, హోటళ్లు, బార్ & రెస్టారెంట్ లు మరియు ఇతరత్ర ప్రాంగణాలలో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్స హించే వారిని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీపీ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కమిషనర్ గారు పేర్కొన్నారు.