Crime ఆన్లైన్లో మోసాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి ముఖ్యంగా దీని వెనక ఎవరు ఉంటున్నారు అనేది తెలియక పోవడం అలా మోసం చేసేవారికి మరింత దన్నుగా నిలుస్తోంది అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో జనసేన నాయకుల్ని టార్గెట్ చేస్తూ క్రియేట్ చేసిన ఓ గ్రూపు ప్రస్తుతం సంచలనంగా మారింది..
మీరు జనసేనకు సంబంధించిన గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ లింకు ద్వారా జాయిన్ అవ్వండి మీరు జనసేన సైనికుల మీకు డబ్బులు కావాలంటే ఆన్లైన్లో ఇప్పిస్తాం.. ఇందులో జాయిన్ అయిన వారికి కేవలం గంటలోనే మీకు కావాల్సిన డబ్బులు ఇప్పిస్తాం.. అంటూ కేవలం వారినే టార్గెట్ చేస్తూ ఆన్లైన్లో కొన్ని లింకులు కనిపిస్తూ ఉన్నాయి… రాజమండ్రివారి రాఘవేంద్ర ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఈ మెసేజ్ వస్తుంది.. కానీ దీన్ని నమ్మి ముందుకు వెళితే మాత్రం తీవ్ర అనర్ధాలు ఎదుర్కోక తప్పదు అని తాజాగా జరిగిన ఇన్వెస్టిగేషన్లో తేలింది..
మీరు పవన్ కళ్యాణ్ అభిమానుల జనసేన తరఫున పనిచేస్తున్నారా మీకు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నాయా అలా అయితే ఓన్లీ ఇప్పిస్తాము ఈ గ్రూపులో జాయిన్ అవ్వండి అంటూ మెసేజ్లు పెడుతున్నాడు ఓ మాయగాడు ఇది నిజమని ఎవరైనా నమ్మితే ఇంకా అక్కడితో వాడి జీవితం అయిపోయినట్టే… తన జేబు నుంచి ధారాళంగా డబ్బు పంచుతున్నట్టు కలరింగ్ ఇస్తాడు. అంతేకాకుండా కిందన నువ్వు చాలా మంచోడు అన్న నువ్వు సూపర్ అన్న మాకు చాలా సాయం చేశావు అని మెసేజ్లు కూడా కనిపిస్తాయి ఇదంతా చూసిన పర్సనల్గా మెసేజ్ చేయమని అంటాడు.. ఇదంతా నిజమేనని నమ్మిన వారు లోన్ కావాలని కాల్ చేస్తారు.. మొదట పాన్ కార్డ్ వాట్సప్ మెసేజ్ పెట్టమని అంటాడు. తర్వాత మీకు రెండు లక్షల వరకూ లోన్ వస్తుందని చెబుతాడు. మా లోను ఏమైందని అడిగితే.. ప్రాసెస్ లో ఉందని అంటాడు. ప్రాసెసింగ్ ఫీ 3800 రూపాయలు పంపమంటాడు. లోన్ కోసం అడిగితే ఏదో ఒక మాయమాటలు చెప్పు రోజులు గడిపేస్తాడు చివరికి మరి సీరియస్ అయ్యే టైంకి ఏం చేస్తావో చేసుకో అంటూ ఆ గ్రూప్ నుంచి తొలగించేస్తాడు ఇది జనసేన నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఒక కేడి చేస్తున్న పని.. ఇలా ఇప్పటి వరకూ చాలా వరకూ మోస పోయారు. వీరి ఆవేదన పార్టీ హెడ్డాఫీస్ కి చేరడంతో.. పార్టీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేయడంతో.. ఈ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.