24-07-2022 న చంద్రశేఖర్ రావు గారి పుత్ర రత్నం, ఐటి శాఖా మాత్యులు, తెలంగాణ యువ దార్శనికుడు అయిన కల్వకుంట్ల తారక రామారావు (KTR) గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి భవనంలో తలసాని సాయి కుమార్ యాదవ్ గారు నిర్వహించిన జన్మదిన వేడుకల సందర్భంగా ప్రముఖ సైకత శిల్ప కళాకారుడు బాలాజీ వరప్రసాద్ గారు ఇసుకతో KTR చిత్రాన్ని నిర్మించి విచ్చేసిన వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. తలసాని సాయికుమార్ గారు తన హృదయ పూర్వక అభినందనలు తెలియచేశారు. తెరాస పార్టీ కార్య కర్తలతో కలసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ సైకత చిత్రకారుడు, Sandart Animation Artist సుధకాంత్ గారు విచ్చేసి సంబరాలలో పాలు పంచుకున్నారు. సైకత శిల్ప కళాకారుడు, బాలాజీ వరప్రసాద్ గారు విజయవాడ వాసితులు, ఆయనను పరిచయం చేసుకోవాలంటే క్రింద ఇవ్వబడిన నెంబర్ కు సంప్రదించండి. +91 99494 84428