Political: ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. నేతలు దూషించుకోవడమే కాకుండా వారి ఇంట్లోని ఆడవాళ్లను కూడా రాజకీయ రొంపిలోకి లాగుతున్నారు. ఇది ఏదో చిన్నాచితక నేతల మధ్య జరుగుతున్న వార్ కాదు. సాక్షాత్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబాల వేదికగా ఈ అసభ్యకరమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రకమైన రాజకీయాలు పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే… తాజాగా విజయవాడ పరిసరాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిపై అసభ్య పదజాలంతో గుర్తు తెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు అంటించారు.
ఇవి ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నవ రాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు కనకదుర్గ వస్తారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పోలీసుల బందోబస్తు పెద్దఎత్తున అధికారులు ఏర్పాటు చేశారు. అంత పోలీసు గస్తీ ఉన్నప్పటికీ పోస్టర్లు అంటించే సాహసం ఎవరు చేస్తారన్న ప్రశ్న అందరిలో తట్టాడుతోంది. అంతేకాదు ఇటీవల చంద్రబాబుపైనా కొన్ని పోస్టర్లు అంటించారు. ఓ ఇంగ్లీఫ్ పత్రికలో ప్రచురితం అయిన యు నీడ్ ఎన్టీఆర్ అనే ఆర్టికల్ ను కూడా గోడలకు అంటించారు.
అయితే భారతీపే అని కూడా కొన్ని చోట్లు జగన్ భార్య భారతీరెడ్డిని ఉద్దేశించి అంటించారు. దీంతో రచ్చ మొదలైంది. తాజాగా భువనేశ్వరిని ఉద్దేశిస్తూ వేసిన పోస్టర్లపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పోస్టర్లు అంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతే కాదు తాము కూడా ప్రతిచర్యకు పాల్పడతామని కొందరు నేతల హెచ్చరిస్తున్నారు. ఈ దుమారం ఇంతటితో ఆగుతుందా..లేక మరో రకంగా మలుపుతిరుగుతుందా అనేది చూడాల్సి ఉంది.