సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్ లోని గూగుల్ ఆఫీస్ జంక్షన్ వద్ద పెడెస్ట్రియన్ క్రాసింగ్ కోసం కొత్త పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్ను ఈరోజు సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు.,, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శ్రీ సందీప్, మాదాపూర్ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీఎస్సీ ట్రాఫిక్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, “సేఫ్ సిటీ ప్రాజెక్ట్” డైరెక్టర్ రఘునందన్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. రోడ్డు దాటే సమయాల్లో ఎక్కువ గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు ద్వారా పెడెస్ట్రియన్ క్రాసింగ్ లో జరిగే ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. సైబరాబాద్ లో మొత్తంగా 44 పెలికాన్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. పాదాచారుల భద్రతా ముఖ్యమని సీపీ గారు తెలిపారు. ఎస్సిఎస్సి మరియు ట్రాఫిక్ వాలంటీర్లను సైబరాబాద్ ట్రాఫిక్ ను మెరుగుపరిచేందుకు అందిస్తున్న సేవలకు గాను సీపీ గారు వారిని అభినందించారు. “సేఫ్ సిటీ ప్రాజెక్ట్” లో భాగంగా పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్ను ఇన్స్టాల్ చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పెలికాన్ సిగ్నల్స్ లను ఏర్పాటు చేస్తామన్నారు.
సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ గారు మాట్లాడుతూ… సైబరాబాద్ లో మొత్తంగా ఇప్పటి వరకు 44 సిగ్నల్స్ ను ఏర్పాటు చేశామన్నారు.
ఈ పెలికాన్ సిగ్నల్ ద్వారా పెడెస్ట్రియన్ క్రాసింగ్ లో జరిగే ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. పాదాచారులు ఎక్కువగా రోడ్ దాటే ప్రదేశాలను గుర్తించి అక్కడ పెలికాన్ సిగ్నల్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
సీపీ గారి వెంట పాటు, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శ్రీ సందీప్, మాదాపూర్ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సయ్య, ఎస్సీఎస్సీ ట్రాఫిక్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, “సేఫ్ సిటీ ప్రాజెక్ట్” డైరెక్టర్ రఘునందన్, ట్రాఫిక్ వాలంటీర్లు ఇతర సిబ్బంది ఉన్నారు.