Political తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ నిన్న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయో.. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలో ముందుగా చెప్పుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ.. ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఈ పార్టీకి ప్రస్తుతం 303 లోక్ సభ స్థానాలు, 92 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. ఈ పార్టీకి ప్రస్తుతం సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు.. ఈ పార్టీకి ప్రస్తుతం పార్లమెంట్ లో 53 లోక్ సభ స్థానాలు 31 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి..
అలాగే తర్వాత ప్రధానమైన జాతీయ పార్టీ ఆల్ ఇండియా తృణమాల కాంగ్రెస్.. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ పార్టీ అధ్యక్షురాలుగా ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొనసాగుతున్నారు.. అలాగే మరో జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈ పార్టీ అధ్యక్షురాలుగా మాయావతి కొనసాగుతున్నారు.. శరత్ పవర్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరో ముఖ్యమైన జాతీయ పార్టీ.. ఏచూరి అధ్యక్షుడిగా కొనసాగుతున్న పార్టీ ఆఫ్ ఇండియా కూడా జాతీయ పార్టీ జాబితాలోనే ఉంది.. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనల్ పీపుల్స్ పార్టీలు కూడా జాతీయ పార్టీ కిందకే వస్తాయి..