Political బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునక్ ఎన్నికైన సంగతి తెలిసిందే.. భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్‌కు కొత్త ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. యూకే ప్రధాని పదవిని చేపడుతోన్న మొదట శ్వేతజాతీయేతర వ్యక్తి రిషి.. అయితే ఈ సందర్భంగా అతని మామ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఒక ఎమోషనల్ పోస్ట్ ను ఉంచారు..
రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవ్వటంపై మొదటిసారిగా అతని మామ నారాయణమూర్తి స్పందించారు.. ఈ సందర్భంగా.. “శుభాకాంక్షలు రిషి మేము నిన్ను చూసి గర్విస్తున్నాం.. మంచి నేతగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం.. యూకే ప్రజల కోసం అతను తన వంతు కృషి చేస్తాడని మేము విశ్వసిస్తున్నాం’’ అని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు… సుధా మూర్తి నారాయణమూర్తిల కుమార్తె అయిన అక్షత మూర్తిని 2009లో రిషి సునక్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్క..
అయితే రిషి సునక్, అక్షత మూర్తిది ప్రేమ వివాహం.. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు.. వీరి ప్రేమ కోసం చెప్పినపుడు.. ఈ వివాహానికి మొదటగా నారాయణమూర్తి ఒప్పుకోలేదట.. అయితే అతన్ని చూసి మాట్లాడిన నారయణ మూర్తి.. ఇండియా వచ్చి “బహుశా అతని అందం నిజాయితీ నీ మనసును దోచుకుని ఉంటాయి..” అంటూ కూతురిని చూసి నవ్వేసారంట నారాయణమూర్తి..