- మలేషియా లో తూర్పు గోదావరి జిల్లా వాసి మృతి
- చనిపోయిన రెండు సంవత్సరాల తరువాత ఇంటికి చేరుకున్న మృతదేహం
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన కాయల సురేష్ రెండు సంవత్సరాల క్రిత్రం మలేషియా కోలాలంపూర్ లోని PPUM యూనివర్సిటీ మలేషియా హాస్పిటల్ లో న్యూమోనియా తో 06/02/2019 న మృతిచెందాడు.
ఈ విషయం ఆసుపత్రి సిబ్బంది చాలా ఆలస్యంగా ఇండియన్ ఎంబసీ కి తెలియజేసారు, తర్వాత ఇండియన్ ఎంబసీ మలేషియా తెలంగాణ అసోసియేషన్ కి మరియు ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ తెలియజేసింది. ఆ వెంటనే మలేషియా తెలంగాణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి మృతుని భార్య మరియు వారి బంధువులకు ఈ విషయాన్ని తెలియజేసి మృతదేహం పంపడానికి కావాల్సిన డాకుమెంట్స్ అన్ని సేకరించి ఇండియన్ ఎంబసీ కి అందించి చివరగా మృతదేహాన్ని ఈరోజు 13/04/2021 మలేసియాన్ ఎయిర్ లైన్స్ MH 180 లో 21:25 కి చెన్నై కి చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేసారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ గారు విమానాశ్రయం నుండి వారి గ్రామానికి ఉచితంగా అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మృత దేహాన్ని పంపడానికి ఆయన మొత్తం ఖర్చు దాదాపు 1.5లక్షలా రూపాయలను మలేషియా లోని ఇండియన్ ఎంబసీ పూర్తిగా భరించిందని మైట వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలియజేసారు.
అలాగే దీనికి సహకరించిన కోర్ కమిటీ సబ్యులకు మరియు APNRT మేడపాటి వెంకట్ గారికి మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.