విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఫస్ట్ సింగిల్ ‘నాలో ఏదో..’ రిలీజ్ చేయబోతున్నారు. సునీల్ కశ్యప్ బ్యూటిఫుల్ కంపోజిషన్ లో హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ చౌదరి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ గా ‘నాలో ఏదో..’ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు శ్రీజో లిరిక్స్ అందించారు. సింగర్స్ దినకర్ కల్వల, అదితి భావరాజు పాడారు. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసిన “సంతాన ప్రాప్తిరస్తు” టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ సాంగ్స్ మీద కూడా మ్యూజిక్ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
నటీనటులు : విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు
టెక్నికల్ టీమ్ :
డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
పబ్లిసిటీ డిజైన్ – మాయాబజార్ డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల