Nagarjuna Sagar By Elections, Kunduru Jana Reddy, Nomula Bhagath, Talasani Srinivas Yadav, Telanagana Politics,
జానారెడ్డి గెలిచి ఏం చేస్తాడు?
*సాగర్ ప్రచారంలో వక్తల వ్యాఖ్య
*పెద్దవాడై పోయాడు.. ఇక కష్టమే
*భగత్ యువకుడు ఉత్సాహవంతుడు
*అధికార టీఆర్ఎస్ కి మాత్రమే అభివృద్ధి సాధ్యం
*నాగార్జున సాగర్ అభివృద్ధి జరగాలంటే కారుకే మీ ఓటు
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇక్కడ బాల్క సుమన్ అధ్వర్యంలోని కొందరు నాయకులు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. నోముల నర్సయ్య కుమారుడు నోముల భగత్ గెలుపే.. ప్రధానంగా.. ఇక్కడికొచ్చిన ప్రతి నాయకుడు ప్రసంగిస్తున్నాడు. వృద్ధుడైన జానారెడ్డి కావాలా- యువకుడైన భగత్ కావాలా? తేల్చుకోమంటున్నారు.
జానారెడ్డి ఇప్పటి వరకూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా- నాలుగు సార్లు మంత్రిగా గెలిచారు. కానీ సాగర్ కి ఆయన చేసింది మాత్రం శూన్యం అన్నది ప్రచారకర్తల మాటగా తెలుస్తోంది. టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఆ మాత్రమైనా ఇక్కడ రైతాంగం బతుకుతోంది. లేకుంటే ఇప్పటికీ రైతు ఆత్మహత్యలు ఆగేవి కావు. కాబట్టి జానారెడ్డి గెలిచినా పెద్ద ప్రయోజనం ఏం లేదన్నది ఇక్కడ ప్రతి ఒక్కరి మాట.
ఇప్పటి వరకూ టీ కాంగ్రెస్ పెద్ద దిక్కెవరో ఇంత వరకూ తేల్చుకోలేక పోయారు. ప్రతిదీ ఢిల్లీ హై కమాండ్ నుంచి ఆర్డర్లు రావాలి. ఈ సిట్యువేషన్లో నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ తరఫున జానా గెలిచినా పెద్ద ప్రయోజనం ఏం ఉండదనీ.. ఆ ఓట్లు వృధా కావడం తప్ప.. మరేం ఉపయోజనం లేదని అంటున్నారు.