తన అన్నయ్యా చిరంజీవి, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌పై ఎవరైనా తప్పుగా మాట్లాడితే గట్టిగా కౌంటర్ ఇస్తానని సినీనటుడు నాగబాబు చెప్పారు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా చిరంజీవి 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని చెప్పారు. ఎంత సాధించినా ఆయన్ను కొందరు ఎందుకు విమర్శిస్తారో అర్థం కావట్లేదన్నారు. తనను నిర్మాతగా నిలబెట్టి జీవితాన్ని ఇచ్చారని.. కాలేజ్ డేస్ నుంచి చిరంజీవి అన్నయ్యకు మంచి క్రేజ్ ఉండేదన్నారు.
తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఏదో చేయాలనే తపన ఉండేదని.. కానీ అన్నయ్య సూచన మేరకు హీరోగా వచ్చి ఇంత క్రేజ్ సంపాదించుకున్నాడని నాగబాబు గుర్తుచేశారు. జనసేనానిగా రాజకీయ చైతన్యాన్ని పవన్ తీసుకొచ్చాడని.. త్వరలోనే ఏపీ రాజకీయ ముఖ చిత్రం మార్చబోయే గొప్పనాయకుడు పవన్ అని కొనియాడారు. అలాంటి నాయకుడిని కానుకగా ఇచ్చిన వ్యక్తి చిరంజీవి అని చెప్పుకొచ్చారు.
తమ కుటుంబంలో అందరికీ బంగారు భవిష్యత్ ఇచ్చిన వ్యక్తి చిరంజీవి అని.. ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఈ విషయంలో ఏమరేమనుకున్నా ఫర్వాలేదని.. తన అన్న, తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం తాట తీస్తానని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.