రాష్ట్రంలో ప్రజా సమస్యలు, వారి ఇబ్బందులపై విపక్షం పోరాడాలి. ఆ విధంగా ప్రజలకు మేలు చేయాలి. ఇది గతంలో జరిగేది. 2014 నుంచి 2019 వరకు నాడు విపక్షనేతగా ఉన్న సీఎం శ్రీ వైయస్ జగన్, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారు. వాటి పరిష్కారం కోసం తపన పడ్డారు. అందుకే 2019 ఎన్నికల్లో ఆయనకు అఖండ మెజారిటీతో ప్రజలు పట్టం కట్టారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం ప్రతిపక్షం హోదా కూడా వస్తుందా? రాదా? అన్న రీతిలో ప్రజలు ఓట్లు వేసి జగన్‌గారికి 151 సీట్లు ఇచ్చారు. అలాంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు జగన్ గారిపై.. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు నిత్యం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏది జరిగినా వాటిని జగన్‌గారికి ఆపాదిస్తున్నారు. ప్రతి అంశాన్ని జగన్‌గారిపై నెట్టడం వీరికి ఆనవాయితీగా మారింది.
– తాను అధికారంలో ఉన్నట్లైతే పోలవరం కట్టేవాణ్ని అని, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే వాణ్ణి అని, కరోనా వచ్చేది కాదు అని, వరదలు కూడా వచ్చేవి కావుఅని.. చంద్రబాబు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం, రాష్ట్రంలో ఏది జరిగినా, దాన్ని జగన్‌గారికి అంటగట్టి ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం నిత్యం జరుగుతోంది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5లో పదే పదే ప్రచారం చేస్తున్నారు.
ఫేక్ వీడియోలు.. ఫేక్ సర్టిఫికెట్లు టీడీపీకి కొత్తకాదు
ఇవాళ టీడీపీకి చెందిన కొందరు నాయకులు, ఎంపీ మాధవ్ వీడియోను తాము అమెరికాలో ఉన్న ఒక ల్యాబ్‌కు పంపామని, వారు దాన్ని ఒరిజినల్ అని చెప్పారని అంటున్నారు. వీళ్ళకు అసలు ఏమాత్రం అయినా సిగ్గు, శరం ఉన్నాయా? అన్నది ప్రజలు గమనించాలి. ఫేక్ వీడియోను తయారు చేసిన ఫోర్ ట్వంటీ చంద్రబాబుకు ఇలాంటి దొంగ సర్టిఫికెట్లు తేవడం కొత్త కాదు. ఆరోజు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు రావడం కోసం ఎవరిని, ఎక్కడికి పంపించాడో ప్రజలందరికీ తెలుసు కదా? చంద్రబాబుకు అవసరమైతే ఎంతకు అయినా దిగజారుతాడో తెలుసు కదా? అమ్మాయిలను ఎర వేసి వాడుకోవడానికి కూడా వెనుకాడని నీచుడు చంద్రబాబునాయుడు.
ఎడిట్ చేసిన వీడియోను రికార్డు చేస్తే ఒరిజినల్ ఎలా అవుతుంది?
అది ఒరిజినల్ వీడియో కాదని..అనంతపురం ఎస్పీ చెప్పారు. దాన్ని ఎడిట్ చేసి, ఒక బాడీ, ఒక తలకాయ కలిపి ఎడిట్ చేశారు. అలా ఎడిట్ చేసిన తర్వాత దాన్ని మరో ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలారని చెప్పారు. ఎడిట్ చేయక ముందు, ఒరిజినల్ వీడియో వస్తే కానీ.. అప్పుడే ఆ బాడీ ఎవరిది? తల ఎవరిది? అన్నది తెలుస్తుందని చెప్పారు. ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు, అసలు వీడియోను మాయం చేసి, ఎడిట్ చేసి, రికార్డు చేసిన వీడియోలను ల్యాబ్‌కు పంపారట. ఆ ల్యాబ్ వాడు ఏం చెప్పాడు. అది ఎడిట్ చేసిన వీడియో కాదని. అనంతపురం ఎస్పీ గారు, మేము చెప్పింది ఏమిటి?. తెలుగుదేశం పార్టీ బాడీ, వైయస్సార్‌సీపీ తలకాయ రెండూ కలిపి ఎడిట్ చేసి అతికించారు. ఆ కలిపిన వీడియోను వేరే ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రచారంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రచారంలో ఉన్న వీడియోను ల్యాబ్‌కు పంపిస్తే, ఏ నివేదిక రాదని ఎస్పీ చెప్పారు. ఒకసారి ఎడిట్ చేసి, దాన్ని మళ్లీ వేరే ఫోన్‌లో రికార్డు చేసిన ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు అమెరికా ల్యాబ్‌కు పంపించాడు. మీరు ఫోర్ ట్వంటీ అని దేశమంతా తెలుసు. అందుకే అమెరికాకు పంపారా?. ఆ రిపోర్టు కూడా అమెరికాలో తయారు చేశారా? లేక మీ ఆఫీసులోనే కూర్చుని తయారు చేశారా?
మరి ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొంగలా మాట్లాడిన మాటలను అమెరికా ల్యాబ్‌కు ఎందుకు పంపలేదు?. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ.. అని మాట్లాడిన చంద్రబాబు మాటలు.. ఆయన మాటలో కాదో ఎందుకు చెప్పలేదు?
పోర్న్ వీడియోలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలా?
జగన్‌గారి గురించి నోటికొచ్చిన ఆరోపణలు చేస్తారా..?. ఆఖరికి, తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి దిగజారిందంటే.. గలీజు వీడియోలను, పోర్న్ వీడియోలలో దొరికే అంగాంగ ప్రదర్శనలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న ఫోర్ ట్వంటీ చంద్రబాబుకు జాతీయ జెండా ఎగురవేసే హక్కు ఉందా? ఇలా ఆడవారిని అడ్డం పెట్టుకుని పార్టీలు నడుపుకోవాలనుకునే వారికి జాతీయ జెండాను ఎగరవేసే హక్కు ఉందా?
టీడీపీ ఆఫీసులోనే దాన్ని ఎడిట్ చేశారేమో..!
జగన్‌గారు ఆప్పుడు, ఇప్పుడు ఒకే మాట స్పష్టంగా చెబుతున్నారు. ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే.. కులం, మతం, రాజకీయం చూడను అని. అలాగే అర్హత ఉంటే సంక్షేమ పథకాల అమలులో కూడా కులం, మతం, వర్గం, రాజకీయం చూడం అన్నారు. అలాంటి ఆయనపై బురద చల్లడం కోసం మా పార్టీకి చెందిన ఒక ఎంపీ మీద ఒక వీడియో తయారు చేశారు. ఊ అంటే ఆ వీడియో చూడలేకపోతున్నాం అంటున్నారు. ఆ వీడియో చివరి వరకు మొత్తం చూస్తే.. రబ్ చేసినట్టు ఉంది. మరి వీళ్లేం చూశారు. బహుశా దాన్ని లింక్ చేయడం కోసం ఎడిట్ చేసినప్పుడు చూసి ఉంటారు. అది కూడా ఆ పార్టీ ఆఫీసులోనే జరిగిందేమో. అప్పుడే ఆ వీడియోను చూశారేమో..!
జగన్‌గారిని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి దొంగ వీడియోలు తీసుకొచ్చి, విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్‌గారు ఏం చెబుతున్నారు. తనకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ ఉందని చెబుతున్నారు. తనకు ఈటీవీ, టీవీ5, ఏబీఎన్ వంటి ఛానళ్లు లేవని, అవి తనతో కలిసి రావని, తనకున్నదల్లా దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెబుతారు. జగన్‌గారు ప్రజల మనిషి. ఆయన ఏదన్నా చెప్పాలనుకుంటే వారికే చెబుతారు. అంతేతప్ప ఆయన మీ ఎల్లో మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది?
పనికిమాలిన పట్టాభి, అనిత మీటింగ్ పెడితే, జనం వస్తారా? వారికి మీడియా కావాలి. జగన్‌గారు సొంతంగా పార్టీ పెట్టి, ప్రజల్లో ఎదిగారు. ఆయనను మీడియా ద్వారా ఇబ్బంది పెట్టాలని చూస్తే, ఏం సాధించలేరు. మీ అటలు సాగవు.
టీడీపీ ఒక ఫేక్ పార్టీ
నిజానికి తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్ పార్టీ. అందుకే దాన్ని టీడీపీ అని కాకుండా టీఎల్‌పీ (తెలుగు లింగ పరిశోధన పార్టీ) అని చెప్పాలి. దానికి చంద్రబాబు అధ్యక్షుడు. అధికారం కోసం ఎంతకైనా దిగజారి, అవసరం అయితే పార్టీ నాయకుల దగ్గరకు అమ్మాయిలను సప్లై చేసే స్థాయికి చంద్రబాబునాయుడు దిగజారారని నిఘా విభాగం ఏడాదిన్నర క్రితమే హెచ్చరించింది. అధికారం కోసం ఆడవారిని అడ్డం పెట్టుకోవడం, అవసరమైతే అమ్మాయిలను సప్లై చేసే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని నిఘా విభాగం ఏడాదిన్నర క్రితమే తెలిపింది.
ఈ మాధవ్ వీడియోను ఎప్పుడు విడుదల చేశారు. ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య చేసుకుంది. దానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కారణమని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో.. మాధవ్ పేరిట ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఒక మహిళ ఆత్మహత్యకు కారణమై, దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మాధవ్ వీడియో రూపొందించి రిలీజ్ చేశారు. దాన్ని పబ్లిక్‌లోకి వదిలి, అందరి దృష్టి మరల్చే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఆ వీడియో ఒరిజినల్ అని ఎవరు చెప్పాడు. ఫస్ట్ వీడియో ఎడిట్ చేసింది. దాన్ని మళ్లీ రికార్డు చేసి, సోషల్ మీడియాలో వదిలారు. అదే విషయాన్ని అనంతపురం ఎస్పీ చెప్పారు. ఎడిట్ అయిన తర్వాత రికార్డు చేసిన వీడియో ఒరిజినల్ అని చెప్పిస్తున్నారు. అంటే ప్రజలు అంత అమాయకులా?
మీరు ఇంకా మాధవ్ వీడియో పేరుతో చేస్తున్న గలీజు రాజకీయాన్ని వదలరా? అలాంటి వీడియోలు సోషల్ మీడియలో కొన్ని కోట్లు ఉంటాయి. అలాంటి ఒక వీడియో రూపొందించి, దానిపై పదే పదే మాట్లాడుతున్నారు. జగన్‌గారిని ఇబ్బంది పెట్టడం కోసం.. మాధవ్ పేరిట వీడియోను తయారు చేసి ప్రభుత్వంపైన బురదజల్లాలని చూస్తారా..? మీకు మాట్లాడడానికి ఇంకా ఏం విషయాలు లేవా?
చివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రోకర్ల మాదిరిగా మారారు. మాధవ్ తనను ఇబ్బంది పెట్టారని ఒక్క మహిళ అయినా బయటకు వచ్చిందా? పోలీసులకు ఫిర్యాదు చేసిందా? ఒక ఎంపీని పట్టుకుని పోరంబోకు నా కొడుకు అంటారా?. ఈ పట్టాభి ఎంత. వాడొక పందికొక్కు. చంద్రబాబు వంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉంటే, పట్టాభి వంటి వెధవలు పది మంది తయారవుతున్నారు. అది తన వీడియో కాదని మాధవ్ స్వయంగా చెబుతుంటే, అది ఆయనదే అని మీరెలా చెబుతారు?
మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, ఏ మాత్రం ఊరుకోబోము. సహించబోము. మేము మీ కంటే ఇంకా ఎక్కువే మాట్లాడగలం. తన మరదలు ఆత్మహత్య చేసుకుంటే, ఆ నింద తనపై పడితే, దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మాధవ్ వీడియోను రిలీజ్ చేశాడు చంద్రబాబు. బావమరిది రోడ్డు ప్రమాదంలో చనిపోతే, ఆ భౌతికకాయం వద్ద రాజకీయాల కోసం మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అసలు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కుని ఉండకపోయి ఉంటే, ఆయన అసలు మరణించే వాడు కాదు కదా?
జగన్‌గారు ప్రజల్లో ఎదిగారు. వారి సమస్యలపై పోరాడారు. ఆయన తన ఇంట్లో కూర్చుని పబ్జీ ఆడుతున్నాడని వాగుతారా… దాన్ని ఎవరు చూశారు? ఇకనైనా పట్టాభి వంటి వారితో మాట్లాడించి, ఇష్టం వచ్చినట్లు తిడితే ఊరుకోబోము.