Politics భారత్లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతీసేలా పెట్రేగుతున్న ఉగ్రవాదుల్ని అణచివేసేందుకు ఇరు ప్రధానులు చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇకమీదట భారత్ బంగ్లాదేశ్ మధ్య బంధాలు మరింత బలపడతాయను వీరిద్దరూ ప్రకటన వెలువరించారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాష్ట్రపతి భవన్ లో ప్రధానమంత్రితో భేటీ అయి మీరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు చెప్పినట్టు తెలుస్తుంది. అనంతరం ఇద్దరూ కూడా ఒక ప్రకటన విలువరించారు. ఏడు ఎంవోయులపై సంతకాలు చేసినట్టు తెలుస్తుంది. తీస్తా నీటి పంపిణీ సహా అన్ని సమస్యలకు త్వరలోనే ఒక ముగింపు రానుందని తన భావిస్తున్నట్టు ప్రధాన మోడీ చెప్పారు. 1997 బంగ్లాదేశ్ ఏర్పాటు నాటి భారత్ బంగ్లా స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు ఇరుదేశాలు ఉగ్రశక్తులను కోవాలని మోడీ అన్నారు.
“రానున్న 25 ఏళ్లలో భారత్ బంగ్లా బంధం సరికొత్త శిఖరాలు చేరుతుందని విశ్వసిస్తున్నట్టు.. బంగ్లాదేశ్ భారత్ కు అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు.. భారత్ బంగ్లా మధ్య వాణిజ్యం వేగంగా వృద్ధి చెందుతుందని.. అంతరిక్షం, అణు శక్తి రంగాల్లో పరస్పరం సహకారం అవసరమని అన్నారు. బంగ్లాదేశ్ కు భారత్ ఎప్పటికీ మిత్ర దేశమే అని.. తమకు విముక్తి రావడంలో భారత్ చేసిన కృషి మరువలేనని తెలిపారు.
స్నేహం ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తుందని భారత్ తో తనకున్న బంధం అలాంటిదే అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఈమె రాష్ట్రపతి ద్రౌపదిమూర్మం ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ ఖడ్ భేటీ అయ్యారు.