Political ప్రధాని హోదాలో ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రాంతాల ప్రత్యేకతల్ని గుర్తు చేసేలా… ఆయా సందర్భాలకు అనుగుణంగా వివిధ బహుమతులు అందుతూ ఉంటాయి. అలా… భారత ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో అందుకున్న బహుమతులన్నింటినీ…. ఆయన జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న వేలం వేయనున్నారు. కేంద్ర సాంస్కృతిక పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనుండగా…. ఆసక్తి ఉన్నవారెవరైనా ఈ-వేలం ద్వారా బహుమతులను కొనుగోలు చేయవచ్చని కేంద్రం వెల్లడించింది. ఇదే మొదటిసారి కాదు… మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 నుంచి ఏటా బహుమతుల వేలం జరుగుతోంది.
ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోదీ దేశానికి ఒక కొత్త మార్గదర్శనం చేస్తున్నారని అన్నారు. ప్రధానిగా ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారని.. ఎందరో ప్రధాన మంత్రులను కలుస్తూ ఉంటారని….ఆయా సందర్భాల్లో ఎంతోమంది గౌరవంగా ప్రధానికి బహుమతులు ఇస్తుంటారు. అలా దేశ చరిత్రలో మొదటిసారి ఆ బహుమతులన్నింటిని మళ్ళీ దేశం కోసమే వినియోగించనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఓ చిన్నారి మోదీ వేసుకున్న శాలువా తనకూ కావాలంటూ లేఖ రాయగా… ప్రధాని ఆ శాలువాను చిన్నారికి పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈసారి ఈ-వేలంలో ఏ బహుమతులు ఉండనున్నాయి…? ఇప్పుడు జరుగుతున్న ఈ-వేలంలో 12 వందల 22 బహుమతులను అందుబాటులో ఉంచాయి. వీటికి కనీసంగా సర్కార్ పాటగా రూ. 2.7 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వీటిలో క్రీడాకారులు ఇచ్చిన 25 బహుమతులు, వారి టి షర్ట్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటేృఅయోధ్య రామమందిరం బహుమతి, వెంకటేశ్వర స్వామి విగ్రహం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం నమూనా సహా…. నేతాజీ సుభాష్ చంద్ర బోస్, సర్ధార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ విగ్రహాలు వేలంలో ఉంచనున్నారు. వేలం ద్వారా వచ్చిన సమకూరిన నిధులను నవామి గంగ కోసం కేటాయించనున్నారు. ఈ-వేలంలో రూ.100 నుంచి 5 లక్షల వరకు బిడ్డింగ్ ఉండనుంది. గతంలో ఓసారి మోదీ ధరించిన డ్రెస్‌ను వేలంలో పెట్టగా…. అది రూ.3 కోట్లకు పైగా ధర పలికింది.