ఈ ఏడాది జూన్ 6 నుండి 13 తేదీలలో థాయిలాండ్ లో జరిగిన 14వ ఆసియా మహిళల అండర్ 18 చాంపియన్ షిప్ లో భారతజట్టులో ప్రాతినిధ్యం వహించిన శాంతాకుమారి. బాలానగర్ గురుకుల పాఠశాలలో చదువుకుని జాతీయ జట్టుకు ఎంపికయిన తొలిబాలిక. అండర్ 18 వాలీబాల్ భారత జట్టుకు తెలంగాణ నుండి ఎంపికయిన శాంతాకుమారి, శాంతాకుమారి స్వగ్రామం వనపర్తి మండలం చిట్యాల తూర్పుతండా, క్రీడలలో వనపర్తి పేరును నిలబెడుతున్న శాంతాకుమారికి అన్ని విధాలా అండగా నిలుస్తాం.
హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో శాంతాకుమారిని సన్మానించి రూ.లక్ష చెక్కు అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి.