హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో జరిగిన తెలంగాణ వికాస సమితి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు.
• అన్నిరంగాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తూ తన ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ లేదంటున్న బిజెపికి…. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓటు ఎందుకు వేయాలి…
• విద్యావంతులైన వారంతా ఆలోచించుకోవాలి. అధికారంలో రాకముందు ధర పెరిగిన సిలిండర్ కి మొక్కి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చిన మోడీ… ఇప్పుడు దేశ ప్రజలకు ఏం చెప్తారు… ఈ ఎన్నికల్లో బీజేపీ కి ఓటేస్తే ధరల పెంపును అంగీకరించినట్లే….. ఎన్నికల్లో గెలిచిన కొద్ది నిత్యవసర వస్తువుల రేట్లు పెంచుతూనే ఉంటారు
• మీ జాతీయవాదం లో తెలంగాణకు స్థానం లేదా తెలంగాణ జాతి ప్రయోజనము లేదా అని కెటిఆర్ సూటి ప్రశ్న
• విద్యాసంస్థల మంజూరులో తెలంగాణపై వివక్ష ఎందుకు అని ప్రశ్నించిన కేటీఆర్
• తెలంగాణకి ఏమిచ్చిందని బిజెపికి ఇక్కడి విద్యావంతులు బీజేపీకి ఓటేయాలని
• తెలంగాణ బాగుపడితే దేశం బాగు పడినట్లు కాదా
• మీరే ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ చెప్పిన సిఫార్సులను ఎందుకు బుట్టదాఖలు చేసింది… ఒక్క ప్రాజెక్ట్ కైన అదనపు నిధులు ఇచ్చారా
• భారతదేశ భవిష్యత్తును రూపొందించాల్సిన నీతి అయోగ్ … ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ఎలా లాంటి కార్యక్రమాలు రూపొందించడం బాధాకరం
• ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న కేంద్రం తప్పకుండా సింగరేణి పైన కూడా పడి అమ్ముతారు
• ఇలా అన్ని రంగాల్లో తెలంగాణకి కేంద్రం స్పష్టమైన ఒక సందేశాన్ని పంపుతుంది
• అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్రం తమ ప్రాధాన్యత క్రమంలో లేదనే విషయాన్ని బీజేపీ చెబుతుంది. అలాంటి బీజేపీకి మనం ఎందుకు ప్రాధాన్యత ఓటు వేయాలో విద్యావంతుడు ఆలోచించాలి…
• కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు గండి కొడుతున్నప్పుడు…. ప్రశ్నించే గొంతు కావాలని ప్రచారం చేస్తున్న బిజేపి ఎమ్మెల్సీ రామచంద్ర రావు ఎందుకు ప్రశ్నించలేదు
• తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, జర్నలిస్ట్, లాయర్, విద్యార్థి వర్గాలతో కలసి ఉద్యమించిన చరిత్ర మాది
• రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయా వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాము
• అయితే కేవలం రాజకీయాల కోసం ఆయా వర్గాలను ఇప్పుడు ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయి.. వారిపైన లేని ప్రేమను ఒలకబోస్తున్నాయి
• ఉద్యోగులకు అత్యధికంగా పిఆర్సి ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా….
• 14 శాతం PRC ఇచ్చిన బిజెపి వారు… 43 శాతం PRC ఇచ్చిన మమ్మల్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది
• గతంలో ఏ బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇంత పెద్ద ఎత్తున పిఆర్సి ఇచ్చిందా
• జర్నలిస్టులకు, లాయర్లకు వంద కోట్ల చొప్పున వారి సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన రాష్ట్రాము ఏదైనా ఉన్నదా
• మేమంతా అసలైన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువుకుంటే… బిజెపి నాయకులు, క్యాడర్ మొత్తం వాట్సాప్ యూనివర్సిటీలో పట్టాలు పొందుతుంది
• విద్యా రంగంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది
• ఉపకులపతులు నియామకంలో బీజేపీ లెక్క మేము రాజకీయాలు చేయలేదు ….మీ లెక్క దుర్మార్గంగా రాజకీయాలకు విసీల నియామకాన్ని వాడుకోలేదు… రోహిత్ వేముల లాంటి విద్యార్థి చావుకు కారణం కాలేదు…
• అంగన్వాడి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాక అన్ని దశల్లోనూ విద్యార్థులకు అండగా నిలుస్తుంది మా ప్రభుత్వం
• విద్యార్థులకు సన్నబియ్యం, 18 లక్షల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ , మెస్ చాఛార్జీల పెంపు, నూతన గురుకులాలు ఏర్పాటు… అందులో ఉన్నవారిపై ఏడాదికి లక్ష రూపాయల ఖర్చు చేస్తుంది నిజం కాదా…. 12800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిజంకాద…. విదేశీ విద్యకు సహాయం కాదా…. ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా
• ఉపాధి కల్పనలోనూ ముందున్నాం….. లక్షల 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం…. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాము..
• ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ
• మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ts-ipass ద్వారా 15 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాం
• తెలంగాణ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలకు పైగా చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విద్యావంతులు అంతా గుర్తించాలి…. మరోవైపు కేంద్రంలో ఉన్న బిజెపి చేస్తున్న అన్యాయాన్ని, వివక్షను కూడా గుర్తుంచుకొని ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరిన కేటియర్
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నిలిపిన అభ్యర్థులు ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులు, విద్యావేత్తలే… విద్యారంగ సమస్యలు, యువకుల సమస్యల పైన అవగాహన ఉన్నవారే…. మా ఇద్దరు అభ్యర్థులకు ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్.