టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు ప్రెస్ మీట్ @తెలంగాణ భవన్.
అభివృద్ధి, ఆత్మగౌరవానికి మునుగోడు పట్టం కట్టింది, కేసీఆర్ నాయకత్వాన్ని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు, తెరాస నేతలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు, తెరాస అభ్యర్థి గెలుపు కోసం గొప్పగా పనిచేసిన సీపీఐ, సీపీఎం నాయకులకు, కామ్రేడ్స్ హృదయపూర్వక ధన్యవాదాలు. నల్గొండలో మూడు ఉపఎన్నికల్లోనూ తెరాసను గెలిపించి అన్ని సీట్లను తెరాసకు కట్టబెట్టిన ప్రజానీకానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం.
రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు, అహంకారంతో బలవంతపు ఎన్నిక తీసుకొచ్చిన మోదీ, అమిత్ షాకు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. గుద్దిన గుద్దుడుకు కింద పడ్డారు. తెర ముందు రాజగోపాల్ రెడ్డి ఉన్నా… తెరవెనక నడిపించింది వారే, ప్రజాతీర్పును కాదని తొమ్మిది ప్రభుత్వాలను కూల్చి తెలంగాణలో వికృత క్రీడ పాల్పడుతున్న వారికి చెంపపెట్టు. తెరాస అభ్యర్థికి ఇంకా మెజారిటీ రావాల్సి ఉంది. దిల్లీ నుంచి వందల కోట్లు పంపారు, డబ్బు మదంతో గెలవాలని ప్రయత్నించారు.
భాజపా నేతలు, వారి అనుచరులు కోట్లతో పట్టుబడిన విషయం వాస్తవం కాదా ? వివేక్ కింగ్ పిన్ లా ఈటలకు డబ్బు పంపాను, 75 కోట్ల రూపాయలు వివేక్ కంపెనీ ఖాతా నుంచి మారింది నిజం కాదా? , జమున హాచరీస్ కు 25 కోట్ల రూపాయలు పంపలేదా ? సుశీ ఇన్ ఫ్రా నుంచి 5.24 కోట్లు మునుగోడులోని ఖాతాలకు బదిలీ చేసింది వాస్తవం కాదా? ఈసీకి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఒత్తిడి తెచ్చి ప్రేక్షక పాత్ర పోషించేలా చేశారు. 15 కంపెనీల సీఆర్పీఎఫ్ బృందాలు, 40 ఐటీ బృందాలను కేంద్రం మునుగోడుపై దండయాత్ర చేసింది. ఈసీ ప్రేక్షకపాత్ర వహించిన మాట వాస్తవం కాదా?
తెరాస గెలుపు అడ్డుకోలేకపోయారు కానీ, మెజారిటీని తగ్గించారు, ఎనిమిదేళ్లలో ఎన్నో ఉపఎన్నికలు వచ్చాయి, ఎక్కడా డబ్బుల మయం ఆరోపణలు లేవు, బడా వ్యాపారవేత్తలు ఈటల, రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడంతోనే డబ్బుమయం ఆరోపణలు వచ్చాయి. డబ్బుమయం ఎవరు చేస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలి. దిల్లీ నుంచి వందల కోట్లు పంపారు. భాజపా నేతలు కారు కూతలు కూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును గౌరవించే సంస్కారం ఉండాలి. భాజపా ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెరాస అభ్యర్థికి 2018 తో పోలిస్తే 23 వేల ఓట్లు గెలిచాయి, రాజగోపాల్ రెడ్డికి 33 వేల ఓట్లు తగ్గాయి. తెరాసకు ఓట్లు 34.29 నుంచి 43 శాతానికి పెరిగాయి.
కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా, ఈసీ ఎలా వ్యవహరించిందో తూర్పారబట్టవచ్చు, తొలగించిన రోడ్డు రోలర్ గుర్తును బలవంతంగా తీసుకొచ్చారు, కారును పోలిన గుర్తుకు 6000 ఓట్లు పడ్డాయి. ఈవీఎంలు మార్చారని, గుర్తులు తారుమారు చేశారని చెప్పవచ్చు. రెండు శిఖండి పార్టీలను ముందు పెట్టారు. రాజగోపాల్ రెడ్డిని కొందరు ప్రజలు చీత్కరించినా మేం రాజకీయం చేయలేదు. పలిమెలలో కావాలనే కయ్యం పెట్టుకొని తెరాస నేతలు, కార్యకర్తల రక్తం చూశారు. సానుభూతి కోసం ఈటల రాజకీయం చేశారు. బండి సంజయ్ తొండిగా అర్ధరాత్రి డ్రామా చేశారు. చివర్లో ఆర్వో కార్యాలయం వద్ద ధర్నాలు. ఉద్యోగ సంఘాలను కూడా విమర్శించారు.
కర్రుకాల్చి వాతపెట్టిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు. డబ్బులిచ్చి కొందరు అభ్యర్థులను పెట్టారు. భాజపా మొత్తం ఆల్ ఫేక్ పార్టీ. ఆసాంతం ఫేక్ ప్రచారం. రాజగోపాల్ రెడ్డికి జ్వరం, ఓటు అన్నీ ఫేక్. పైన ఫేకుడు… ఇక్కడ జోకుడు…దారుణంగా ఎన్నికల సంఘంపై దాడి చేశారు. బండి సంజయ్ కు ఏమీ తెలియదు, చెప్పేవాళ్ళు కూడా లేరు, ఈసీని విమర్శించడం అంటే… మోదీని విమర్శించడమే, వాళ్ళు చేస్తే సంసారం… ఇంకొకరు చేస్తే వ్యభిచారం, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రధాని, అమిత్ షా రావచ్చా ? కమ్యూనిస్టులతో భవిష్యత్ లో కలిసి పనిచేసేది అధిష్టానాలు చూస్తాయి, పార్టీ పేరు మార్పు నిర్ణయాన్ని ఎవరు ఆపుతున్నారో చూడాలి, పేరు మారాక గుజరాత్ అంశాన్ని చూద్దాం.