Political News: ప్రస్తుతం తెలంగాణ రాజకీయం వేడెక్కుతుందనే చెప్పుకోవాలి. ఎలక్షన్స్ రావడంతో ఎవరికి వారే తమ తమ పార్టీలపై గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నారు. అయితే ఇదే బాటలో మంత్రి హరీష్ రావు కూడా కేంద్రం తీరుపై విమర్శలు చేయడం విశేషం. కేంద్ర ప్రభుత్వం అలానే తెలంగాణలోని బిజెపి ప్రభుత్వం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వచ్చే కరెంటును రాకుండా చేసిందని ఈరోజు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో నిర్మించిన 23 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు తెలియజేయడం జరిగింది.
అలానే మంత్రి హరీష్ రావు త్వరలోనే సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి 3 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలానే ఈ ప్రసంగంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచిత పథకాలు వద్దని చెప్తూనే కొన్ని వేల కోట్లు పరిశీలించవేతలకు మాఫీ చేసింది అని ప్రసంగంలో వెల్లడించారు. మోడీ రాష్ట్ర ప్రభుత్వాలపై ఉచిత పథకాలను ఎద్దేవా చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలిపారు.
పేదల కడుపులో కొట్టి … ధనవంతులను ఇంకా ధనవంతులు చేస్తున్నారని పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నాడని కేంద్ర ప్రభుత్వంపై దుయ్యబడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆదాయం పెంచింది కేసీఆర్ ప్రభుత్వం అయితే, ప్రజల సొమ్మును ఇక్కడి నుంచి అప్పు చేసిన విదేశాల్లో దాక్కున వారికి పంచిపెట్టే ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరగడం కేసీఆర్ ప్రభుత్వం యొక్క పనితీరు అని పేర్కొన్నారు.