నాగార్జునసాగర్ లోని బుద్ధ వనమును మహారాష్ట్ర నాగపూర్ కి చెందిన రాజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో సిద్ధార్థ బుద్ధ విహార సభ్యులు సందర్శించారు. దీంట్లో భాగంగా బుద్ధ చరిత వనం లోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశారు. అనంతరం బుద్ధవనములోని బుద్ధ చరిత వనం, జాతక పార్కు ,స్థూప పార్కులను సందర్శించిన అనంతరం మహస్తుపంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు.
ఈ సందర్భంగా రాజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు మాట్లాడుతూ… ప్రతి ఏటా దేశంలోని ప్రముఖ బౌద్ధ ప్రాంతాలను సందర్శిస్తుంటామని దీనిలో భాగంగా మంగళవారం నాడు బుద్ధవరమును సందర్శించినట్లుగా తెలిపారు.. వీరికి స్థానిక టూరిజం గైడు సత్యనారాయణ బుద్ధ వనం విశేషాలను వివరించారు.