Mehar Ramesh : సినిమా ఇండస్ట్రిలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రేటీల లవ్ స్టోరీల గురించి ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నడుస్తుంది. ఇటీవల కాలంలో పలు జంటలు తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ పెళ్లిపీటలు కూడా ఎక్కారు. ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే ప్రభాస్, అనుష్క శెట్టి జంట గురించి గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వారిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికి వారు ఇరువురు కూడా ఎప్పుడూ వాటిని ఖండిస్తూ తాము మంచి స్నేహితులం అని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా వారి రిలేషన్షిప్ గురించి డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ‘బిల్లా’ సినిమాలో ప్రభాస్, అనుష్క శెట్టి జంటగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఈ జంటని చాలా దగ్గర నుంచి గమనించిన మెహర్ రమేశ్ తాజాగా వారి గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. అరుంధతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన తర్వాత బిల్లా సినిమాలో ప్రభాస్కి జోడీగా అనుష్క శెట్టి చేసింది. అరుంధతిలో జేజమ్మ లాంటి గొప్ప క్యారెక్టర్ చేసిన అనుష్క తర్వాత బిల్లా సినిమాలో బికిని వేసుకుని మళ్లీ గ్లామర్ సైడ్ వచ్చింది. ప్రభాస్, అనుష్క శెట్టి కెమిస్ట్రీ గురించి చెప్పాలంటే ఆ ఇద్దరూ నేషన్స్ బెస్ట్ ఫెయిర్. బిల్లా అనే కాదు ఆ తర్వాత వచ్చిన మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2లో ఇద్దరి కెమెస్ట్రీ బాగుంది’’ అని మెహర్ రమేశ్ చెప్పుకొచ్చాడు.
మెహర్ రమేశ్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లి పాత్రలో ప్రముఖ నటి కీర్తి సురేశ్ నటిస్తుంది. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ మరోసారి హై సాధించాలని ఆయన అభిమానులంతా కోరుకుంటున్నారు.