Megastar Chiranjeevi: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా రావడం కాస్తా లేటు అయినా లేటెస్ట్ గా వచ్చింది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ షిట్ కొట్టింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురిసింది. అయితే ఈ కథకు మూలం మలయాళ సినిమా లూసీఫర్. ఈ చిత్రం మూలంగా చేసుకుని గాడ్ ఫాదర్ ను రీమేక్‌గా తెరకెక్కించారు. మళయాళంలో ఈ చిత్రం ఎంత భారీ స్థాయిని అందుకుందో తెలుగులో కూడా ఇదే స్థాయిలో ఊహించని రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
గాడ్ ఫాదర్ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో మెగాస్టార్ చిరు నటించిన హిట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని ఈ గాడ్ ఫాదర్ అనుకోని తీరులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రానికి మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. దీనిలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్‌లు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ చిత్రం నుంచి మరి కొద్ది రోజుల్లో ఓ అప్టేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని సినీ వర్గాల వినికిడి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే పనిలో పనిగా ఈ సినిమాను అతి త్వరలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేందుకు చూస్తున్నట్లు సినీ వర్గాల టాక్. అయితే ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అనే దానిపై పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. కానీ అన్నీ అనుకున్నట్లు అయితే ఈ సినిమా నవంబర్ 19 నుంచి ఓటీటీలో సందడి చేయొచ్చు అని అంచనా. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటనను నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు చేస్తుంది అనేది ఎదురు చూడాలి.