Entertainment రాజకీయాల్లో కొన్ని కొన్ని విభేదాలతో మెగా ఫ్యామిలీలో విభేదాలు తలెత్తయని ఏర్నాల నుంచి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఎప్పుడు ఖండిస్తూనే వస్తున్నప్పటికీ చిరంజీవి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం పవన్ కళ్యాణ్ కి తన మద్దతు అంటూ ప్రకటించేశారు అంతేకాకుండా తన తమ్ముడిని ఎవరు ఏమన్నా అసలు ఒప్పుకోకుండా కౌంటర్ ఇచ్చేస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు..
మెగాస్టార్ చిరంజీవి తన పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ కి అని నిరూపించేశారు ఇప్పటికే పలమార్లు తన తమ్ముడి కోసం ఎన్నో విషయాలు పంచుకుంటూ వచ్చిన ఆయన తాజాగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ తన మాంసం ఎంతో మంచిదని చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ చెప్పకు వచ్చారు ఈ సందర్భంగా మరిన్ని విషయాలు తెలిపారు.. “పవన్ కళ్యాణ్ కు కొంత కూడా స్వార్థం లేదు. పదవీ కాంక్ష లేదు. డబ్బు వ్యామోహం అసలే లేదు. ఇది నేను ఓ అన్నగా చెప్పటం లేదు. తనను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నాను. తన గురించి తానెప్పుడూ ఆలోచించుకోడు. అంతెందుకు నిన్న మొన్నటి దాకా వాడికి సొంత ఇల్లు కూడా లేదు. మా అందరికీ ఇళ్లున్నాయి. నువ్వు కూడా కట్టుకో అని అంటే, చూద్దాం అని దాటేసేవాడు. వేళకు అన్నం తినడు, సరైన బట్టలు వేసుకోడు. అన్నీ వదిలేసిన యోగిలాంటివాడు. సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో ఉంటాడు… ” తెలిపారు..