AP Poilitcs : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్‌కు భవిష్యత్‌లో రాజకీయ మద్దతిస్తానేమో తెలియదు అంటున్నారు చిరంజీవి..
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తన తమ్ముడు ఆయన పవన్ కళ్యాణ్ కు భవిష్యత్తులో రాజకీయ మద్దతు ఇస్తానేమో అంటున్నారు పవన్ లాంటి నిబద్ధత ఉన్న నాయకులు ఆధికారంలోకి వస్తే తప్పకుండా రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు.. పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని అతనికి అన్ని విధాల మంచే జరగాలని అన్నారు అంతే కాకుండా గాడ్ ఫాదర్ మూవీ లో రాజకీయ కోణం కోసం మాట్లాడారు ఈ సినిమాలో ఉన్న డైలాగులు ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాసినవ కాదని సినిమా యదార్థ కథ ప్రకారం నడిచిందని అన్నారు వాటిని చూసి ఎవరైనా తమ కోసమే అని అనుకుంటే చేసేదేమీ లేదంటూ ఘాటుగా స్పందించారు ప్రస్తుతానికైతే రాజకీయాల నుంచి విరమించి విశ్రాంతి తీసుకుంటున్న మెగాస్టార్ భవిష్యత్తులో తప్పకుండా మళ్లీ రాజకీయాల్లోకి లోకి వస్తారేమో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.