Entertainment మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు గా పేరు సంపాదించుకుంటూ కెరియర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఇతను కెరియర్లో వరుస హిట్లను అందుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం ఓ రికార్డును క్రియేట్ చేశారు..
చిరుత సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాల్ని అందుపుచ్చుకుంటూ కెరియర్ లో ముందుకి దూసుకుపోతున్నారు. తాజాగా చరణ్ నటించిన ఆర్ఆర్అర్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాటు నాటు పాట తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడమే కాకుండా ఈ సినిమా సైతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాంచరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.. అలాగే చరణ్ కు కు సోషల్ మీడియాలో అధికంగా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో 12 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకున్నారు చెర్రీ.
సోషల్ మీడియాలో తక్కువగానే ఉంటూ పోస్టులు కూడా తక్కువగానే పెట్టినప్పటికీ ఇంతటి క్రేజ్ సంపాదించుకొని రికార్డ్ క్రియేట్ చేశారు చెర్రీ… అటు ట్వీటర్ లోనూ దాదాపు 3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పటికి సోషల్ మీడియా ఇన్ స్టాలో 19.9 మిలియన్ల అత్యధిక ఫాలోవర్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ 17.8 మిలియన్ల ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నారు. అయితే రోజురోజుకీ తన రీజన్ పెంచుకుంటూ వెళ్తున్న రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లోనే వేరే రికార్డింగ్ సైతం దాటేసేలా కనిపిస్తున్నారు ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకుంటే రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది..