Politics జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో మెచ్చుకున్నారు తను అనుకున్న లక్ష్యానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాడని ఇప్పటికి టిడిపికి బిజెపి కో అతను సపోర్ట్ చేసి ఉంటే ఈపాటికి మందు స్థాయిలో ఉండేవాడని కానీ పవన్ కళ్యాణ్ అలా అనుకోవట్లేదు అని చెప్పకు వచ్చారు నాగబాబు..
మెగా ఫ్యామిలీలో నాగబాబు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉంటూ వస్తున్నారు అలాగే ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ కోసం చెప్పక వచ్చిన మెగా బ్రదర్.. మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.. పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే బతుకుతున్నారని అందుకే రాజకీయాల వైపు వచ్చారని అన్నారు ఇంత స్టార్ స్టేటస్ ను వదులుకొని రావడానికి కారణం కూడా ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం తప్ప మరొకటి కాదని అన్నారు.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్పై గణ రాసిన ‘‘ ద రియల్ యోగి’’ అనే పుస్తకాన్ని నాగబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం మాత్రమే అతనికి ఉందని అందుకే జనసేన పార్టీని స్థాపించారని అన్నారు.. కోట్లాదిమందికి సాయం చేయాలని ఉద్దేశం తప్ప తనకు ఇంకేమీ లేదని అయితే పవన్ తన సొంత తమ్ముడు కాబట్టి అతని గురించి ఇంకా ఏమి చెప్పలేకపోతున్నాను అంటూ చెప్పకు వచ్చారు నాగబాబు.. పవన్ కళ్యాణ్ టిడిపిలోనూ బిజెపి లోను చేరి ఉంటే ఈపాటికి మంత్రి అయ్యి ఉండేవారని కానీ పవన్ కు పదవులపై ఎలాంటి మక్కువ లేదంటూ చెప్పుకొచ్చారు.. నాగబాబు