మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ బర్త్ డే సందర్భంగా ఫుల్ కిక్కు..అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను ఈ రోజు రిలీజ్ చేశారు.
ఈ మాస్ సాంగ్ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అధ్బుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఫుల్ ఎనర్జీ తో ఆలపించారు. ఇక శ్రీమణి అందించిన సాహిత్యం మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొత్త స్టెప్పులు వేయించారు. ఇక రవితేజ, డింపుల్ హయతి కలిసి తమ డాన్స్ తో అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. లుంగిలో రవితేజ మాస్ స్టెప్పులు, తెరపై ఆయన ఎనర్జీ అభిమానులకు కన్నుల పండువగా ఉంది.
ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.
నటీనటులు : రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్
సాంకేతిక బృందం : కథ, కథనం, దర్శకత్వం : రమేష్ వర్మ,నిర్మాత : సత్యనారాయణ కోనేరు, బ్యానర్ : ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్, ప్రొడక్షన్ : ఏ హవీష్ ప్రొడక్షన్, సమర్పణ : డాక్టర్ జయంతిలాల్ గద, సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్ : సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు, స్క్రిప్ట్ కో ఆర్టినేషన్ : పాత్రికేయ, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, అన్బు అరివు, డైలాగ్స్ : శ్రీకాంత్ విస్స, సాగర్, ఎడిటర్ : అమర్ రెడ్డి, లిరిక్స్ : శ్రీ మణి, స్టిల్స్ : సాయి మాగంటి,, మేకప్ : ఐ శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మురళీకృష్ణ కొడాలి, ప్రొడక్షన్ హెడ్ : పూర్ణ కండ్రు,పబ్లిసిటీ : రామ్ పెద్దిటి సుధీర్, కో డైరెక్టర్ : పవన్ కేఆర్కే, ఆర్ట్ : గాంధీ నందికుడ్కర్, పీఆర్ : వంశీ-శేఖర్.