Political రానున్న గుజరాత్ ఎన్నికల్లో సత్చా చాటారని ప్రయత్నిస్తున్న ఆప్ పార్టీ అనుకోని తీరుగా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఆప్ మంత్రి వర్గంలో సభ్యుడిగా ఉన్న రాజేంద్ర పాల్ గౌతమ్… తాను హిందూ మతంలోని దేవుళ్లను పూజించనని, వాళ్లు దండం కూడా పెట్టనంటూ చేసిన ప్రతిజ్ఞ వివాదాస్పదమైంది. దాంతో వివాదం ముదరగా… ఇప్పుడు ఆ మంత్రి రాజీనామా చేశారు.
దీల్లీలో అక్టోబర్ 5న సుమారు 7 వేల మంది బౌద్ధాన్ని స్వీకరిస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారితో వాటే ప్రతిజ్ఞ చేయడంతో పాటు.. హిందూ ధర్మాన్ని కించపరిచేలా… వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో.. హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో పాటు.. భాజపా నుంచి రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లోనుూ హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో… తనకు రాజ్యాంగం మత స్వేచ్ఛను కల్పించిందని.. తనకు ఏ మతానైనా స్వీకరించే హక్కుందంటూ.. అందు కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ వ్యాఖ్యానించారు. దాంతో… తన ఏ మతాన్ని స్వీకరించినా అభ్యంతరం లేదన్న హిందూ సంఘాలు… హిందూ ధర్మాన్ని కించపరిస్తే.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు ఎలా అవుతుంది అంటూ వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ ఘటనకు సంబంధించిన నిరసన సెగలు తగిలాయి. శనివారం కేజ్రీవాల్ పాల్గొనాల్సిన ర్యాలీకి కొద్దిసేపటికి ముందే ఆయన బ్యానర్లు చించేసి…. కేజ్రీవాల్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ నేపథ్యంలో కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉండగానే మంత్రి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా… రాజీనామాకు ముందు కూడా గౌతమ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించారు. కేసులకు భయపడేది లేదని అన్నారు.