Crime స్కూల్ బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది విద్యార్థులు చనిపోయారు ఈ సంఘటన మణుపూర్ రాష్ట్రంలో చోటుచేసుకుంది..
మణిపూర్ లోని నోనీ జిల్లాలో చోటు చేసుకున్న స్కూల్ బస్సు ప్రమాదంలో పలువురు విద్యార్థులు చనిపోయిన సంఘటన అందర్నీ షాక్కు గురి చేసింది.. విహారయాత్రకు విద్యార్థులు వెళుతుండగా రెండు బస్సులు అదుపుతప్పి బోల్తా పడ్డాయి.. నోని జిల్లాలోని బిష్ణుపూర్ ఖైపూర్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులను తీసుకెళ్తున్న రెండు బస్సులు తంబలను హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందినవిగా గుర్తించారు. విద్యార్థులు స్టడీ టూర్ కోసం ఖోపూమ్‌కు వెళుతున్నామని చెప్పారు. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు చనిపోయారు..
అంతేకాకుండా ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు వీరందరినీ దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి చేర్చారు అయితే ఇప్పటివరకు 20 మంది విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉందని తెలుస్తోంది.. ఈ ప్రమాదంపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్‌సింగ్ విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటనపై మణిపూర్ ప్రభుత్వం స్పందించింది.. అలాగే ప్రమాదంపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్‌సింగ్ విచారం వ్యక్తం చేశారు. పాత కచర్ల రోడ్డులో పాఠశాల బస్సులు ప్రమాదానికి గురికావడం బాధాకరమన్నారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకుంటామని తెలిపింది.. అలాగే విద్యార్థినుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.. ప్రమాదం అనంతరం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్‌డిఆర్‌ఎఫ్, వైద్యబృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.