Entertainment భామా మౌనికను మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోనున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ సన్నిహితంగా మీడియా కంట కూడా పడుతూ వస్తున్నారు. కానీ ఇప్పటివరకు వీరి పెళ్లి వార్తలపై స్పందించలేదు మంచు కుటుంబం. అయితే తాజాగా ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందించారు..
మంచు లక్ష్మి తాజాగా శ్రీకాళహస్తి గుడికి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఆమెను మంచు మనోజ్ పెళ్లిపై ప్రశ్నలు కురిపించారు.. మంచు మనోజ్ మౌనిక పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కదా అవి ఎంతవరకు నిజం అంటూ అడిగారు. అయితే ఈ వార్తలతో మంచు లక్ష్మి కొంత సహనానికి గురయ్యారు. అలాగే గుడిలో ఇలాంటి విషయాలని మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మనోజ్ పెళ్లి సంగతి నాకు తెలియదన్నారు. నా పరిధిలో ఉన్న విషయాలు మాత్రమే నేను చెప్పగలను అన్నారు. మనోజ్ వివాహం నా పరిధిలో లేదని పరోక్షంగా వెల్లడించారు. తెల్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవసరం అయితే మనోజ్ ను అడగమని చెప్పుకొచ్చారు..
అయితే మంచు లక్ష్మి చెప్పిన సమాధానం చాలామందిని ఎన్నో ప్రశ్నలకు గురిచేసింది. మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని మరొకసారి మాట్లాడుకునే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా మంచు మనోజ్ భామ మౌనికను పెళ్లి చేసుకోవడం వారి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని కానీ మనోజ్ ఇష్టప్రకారం ముందుకు వెళుతున్నాడు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.