Madhukar Art & Cfaft, Multi Talented Madhukar, TOP10 Best Hyd Painters,
మధు’రమైన ఆలోచనలతో యువ కళాకారుడు “మధుకర్”
క్రియేటివిటీగా కొత్త దనంగా ఆలోచించడం మధుకర్ ప్రత్యేకత అదే ఇప్పుడు ఎన్నో ఆలోచనలకు కార్యరూపం అయింది.
చిన్నప్పటి నుండే ప్రత్యేక ఆలోచనలతో కొనసాగడం వల్ల ప్రస్తుతం ఎన్నో కళలలో నైపుణ్యం సాధిస్తున్నాడు.
అతనే మద్నూర్ మండల కేంద్రానికి చెందిన పత్తివార్ పరమేష్, సుశీల కుమారుడు.
ప్రత్యేక కళలతో ఆకట్టుకుటుంటున్న యువ కిరీటం,
రెండు చేతులతో రాతలు,అలాగే నోటితో ఏడు బాషలలో ఐదారు రకాలుగా తిరిగేసి, రివర్స్ లో పలు విధాలుగా రాయడం,
నీటి పైన, నీటి అడుగు భాగంలో ఒకే పాత్రలో తీసుకున్న నీటిలో ముగ్గు పిండితో జాతీయ పతకాలు వేయడం జరిగింది మన
మల్టీ టాలెంటెడ్ మధుకర్,
రాష్ట్ర,జిల్లా స్థాయిలో ప్రముఖులతో ప్రశంస పత్రాలు అందుకోవడం జరిగింది.
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన మధుకర్ ప్రత్యేక కళలతో మన్ననలు పొందుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. తాను డిగ్రీ, డి.ఎడ్, వృత్తి విద్య డ్రాయింగ్ లోయర్, హైయర్ కోర్స్ పూర్తి చేసి పాఠశాలలో విద్య వాలంటీర్ గా కొనసాగిస్తున్నాడు. ఇక తాను పదవ తరగతి నుండే నూతన ఆలోచనలకు స్వాగతం పలికాడు. ఇక అప్పటి నుండి ఏదో ఒకటి చేస్తూ నలుగురిలో ప్రత్యేకంగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇక ఆడవాళ్లు ముగ్గు నేల పై వేస్తారు కానీ దానికి భిన్నంగా మధుకర్ ఒకే పాత్రలో తీసుకున్న నీటిలో నీటిపై, నీటి అడుగు భాగంలో రెండు విధాలుగా బొమ్మలు వేయడం జరుగుతుంది అలా వేసిన ముగ్గు బొమ్మలు పాడవకుండా కొన్ని గంటల పాటు ఉండడం ప్రత్యేకత. అలాగే రెండు చేతులతో ఓకేసారి రాయడం, అలాగే విడి విడిగా రాయడం.. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, గుజరాతి,హిందీ,ఒరియా భాషలలో రివర్స్ లో తిరిగేసి ఓ ఐదారు రకాలుగా రాయడం జరుగుతుంది.. రివర్స్ లో రాసిన పదాలను అద్దంలో చూసినట్టు అయితే యధావిదంగా కనపడడం గమన్హారం. అలాగే నోటితో కూడా సునాయాసంగా రాయగలగడం.అలాగే బెలూన్ లోపల భాగంలో బొమ్మలు వేయడం జరుగుతుంది. అలాగే సుద్ద ముక్కలతో కళాకృతులు తెలుగు అక్షర మాల, అలాగే జాతీయ గీతంని పూర్తిగా అక్షరాలుగా చెక్కి తెలుగు, ఆంగ్లoలో చెక్కి తయారు చేయడం జరిగింది. ప్రత్యేక దినోత్సవాలు పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా పుట్నాలపై జాతీయ గీతం రాయడం జరిగింది. ఆవాలతో గాంధీజీ చిత్రం చేయడం జరిగింది. అలాగే మూడు రంగుల బెలూన్ లోపలి భాగంలో తెలుగు, ఆంగ్లo, హిందీ మూడు భాషలలో జాతీయ గీతం జనగణమన రాయడం జరిగింది. అలాగే పర్యావరణ దినోత్సవం సందర్బంగా మొక్కలను పెంచి పర్యావరణoని రక్షించాలనే సందేశంతో పాడై పోయిన బలుబు లోపల మొక్క జొన్న విత్తనాలను మొలిపించి మొక్కలు పెరిగేలా చేయడం జరిగింది. అలాగే పెద్ద ఆకును చెక్కి వృక్షం ఆకారంలో చేయడం జరిగింది. పాడై పోయినా బలుబులో మూడు రంగుల సబ్బులతో మూడు మతాల గుర్తులను చెక్కి అందులో అమర్చడం జరిగింది. అలాగే తెలంగాణ వచ్చిన సందర్బంగా బలుబు లోపల తెలంగాణ పతాకం, స్వతంత్ర దినోత్సవం సందర్బంగా బలుబు లోపల జాతీయ పతాకం అమర్చడం జరిగింది. తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్బంగా పూసలతో బతుకుమ్మను బలుబు లోపల చేయడం జరిగింది. మట్టి వినాయకుడిని పూజించాలని బలుబు లోపల మట్టి వినాయకుడి ప్రతిమ ఆవిష్కరణ చేయడం జరిగింది. పర్యావరణo గురించి ఇతర విషయాలపై అవగాహనా చేసేలా సందేశాత్మక చిత్రాలు గీయడం జరిగింది. అలాగే పలు విషయాలపై కవితలు, అలాగే సుమారుగా ఐదు వేల వరకు కొటేషన్ లు రాయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయాన్ని అవగాహన కలిగించడం జరుగుతుంది. నూతన ఆలోచనలతో, కవితలతో, కొటేషన్ లతో, చిత్రాలతో అవగాహన కలిగిస్తున్నాడు.
అలాగే కొందరు పురాతన నాణేలు, స్టాంపులు సేకరిస్తారు కానీ దానికి భిన్నoగా మధుకర్ ఆయా దినపత్రికలలో వచ్చిన మెయిన్, జిల్లా పేజీ, సండే మ్యాక్జిన్ అలాగే ఇతర వాటిలోని ఆర్టికల్ లు సేకరించడం జరిగింది. 2008 నుండి సేకరించడం మొదలు పెట్టి ఇప్పుడు 2లక్షల వరకు కావడం జరిగింది. వాటిని పాత నోట్ బుక్ లలో అతికించి చదివేలా ఆల్బమ్ లాగా చేయడం జరిగింది. ఇక ఆ న్యూస్ లలో భూత, భవిష్యత్తు, వర్తమాన లోని జరిగిన, జరుగుతున్న ప్రతి సమాచారం వింతలు, విశేశాలు, సైన్స్, పర్యావరణం ఇలా అది ఇది అని కాకుండా ఉపయోగపడే స్ఫూర్తి దాయకం అయినా ప్రతి న్యూస్ ఉండడం గమన్హారం. అలాగే ఎలక్ట్రానిక్ గొడుగు చేయడం జరిగింది. రాత్రి వేలలో వాన కాలంలో పొలంకి పోవడానికి రైతులకు ఉపయోగపడేలా గొడుగు చేయడం జరిగింది. అందులో పాటలు వినేలా కూడా చేయడం జరిగింది ఇక రాత్రి పూట పాటలు వింటూ, బ్యాటరీ అవసరం లేకుండా అందులో అమర్చిన వెలుతురులో ఎంచక్కా పొలం బాట పోతే ఆ ఆనందమే వేరు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అలాగే చిన్న పిల్లలకు ఆసక్తి కలిగేలా ఎలక్ట్రానిక్ ప్యాడ్ చేయడం జరిగింది ప్యాడ్ పై వెలుతురు వచ్చేలా ఇక చీకటిలో ఎంచక్కా వెలుతురులో రాసుకోవచ్చు, చదువుకోవచ్చు.
అలాగే క్లే అనే మట్టితో ఇంట్లో అలంకరణ కోసం అలాగే ఏదయినా కార్యక్రమాలలో ఇచ్చేందుకు బహుమతులుగా అద్భుతమైన,అందమైన బొమ్మలు చేయడం జరుగుతుంది. అలాగే సిమెంట్ తో ఫౌంటెన్ చేస్తాడు నీళ్లు రీసైకిల్ అవుతాయి. వివిధ ఆకారాల్లో చేయడం జరుగుతుంది. అలాగే అందులో చేపలు వేసి అక్వెరియం లాగా కూడా వాడుకోవచ్చు.
అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాస, చిత్రకళ పోటీలలో ప్రశంస పత్రాలు అందుకోవడం జరిగింది. అలాగే యువజన వారోత్సవాల్లో 2013లో క్విజ్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో గెలిచి శిల్పారామంలో బాడ్మింటన్ క్రీడాకారిణి చేతుల మీదుగా ప్రశంస పత్రం, మెమొంటో అందుకోవడం జరిగింది. అలాగే మాజీ MP చేతుల మీదుగా, అలాగే బెంగళూరు లో, హర్యానా లో జరిగిన ఏక్ భారత్ శ్రేష్ట్ భరత్ కార్యక్రమంలో పాల్గొని ప్రశంస పత్రాలు, మెమోంటోలు పొందడం జరిగింది. అలాగే మహబూబ్ నగర్ లో 2015లో ఫాన్సీ డ్రెస్ లో వికలాంగుల పాత్ర వేషధారణలో మొదటి స్థానంలో రావడం జరిగింది ప్రశంస పత్రం, మెమోంటో తీసుకోవడం జరిగింది. ఇలా ఎన్నో కళలతో పాటు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం పొందడం జరిగింది…
ప్రోత్సహిస్తే మరిన్ని ప్రయోగాలు:
అధికారులు,నాయకులు తన కళను గుర్తించి సహాయపడితే ఏదయినా ఆవిష్కరణ దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరుగుతుంది.అలాగే లిక్కా రికార్డు, గిన్నిస్ రికార్డు లలో పేరు ఎక్కడం నా కోరిక.అలాగే ఉపాధ్యాయుడిగా విద్యార్థులలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను.