Entertainment మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు వార్తలో నిలుస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాటకు డాన్స్ వేసి అందరిని మెస్మరైజ్ చేసింది..
మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రంలోని పాటకు డాన్స్ వేసి అదరగొట్టింది.. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ పాటకు మంచు లక్ష్మీ మాస్ డాన్స్ చేసింది.. ఈ పాటకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఇందులో ఈమె జబర్దస్త్ కమెడియన్ తో కలిసి ఆడి పాడింది.. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అంతేకాకుండా ఈ వీడియోకు పాజిటివ్ కూడా వచ్చింది.
వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ పాటకు మంచు లక్ష్మీ మాస్ డాన్స్ తో మంటలు పుట్టించింది. అంతేకాకుండా ఈ వీడియోలో రంగస్థలం ఫేమ్ మహేష్ కూడా ఉన్నారు. మీరు ఇద్దరూ కలిసి ఈ పాటకు స్టెప్పులు వేశారు.. ఇందులో మంచు లక్ష్మి చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు . ఏది ఏమైనా పాట ఒకవైపు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే మరోవైపు మంచు లక్ష్మి వేసిన డాన్స్ కూడా అంతే ట్రెండ్ అవుతూ వస్తుంది అయితే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించారు అలాగే శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది.. అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది..