ఓ తండ్రి తీర్పు చిత్ర యూనిట్ ఘన నివాళి
ప్రముఖ సంఘ సేవకులు కె.బీ.ఆర్. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అనేక సాహితీ సంస్థల స్వచ్ఛంద సేవా సంస్థల వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ గారి సతీమణి శ్రీమతి కృష్ణ కుమారి మరణం వారి కుటుంబానికే కాదు సమాజానికి తీరని లోటు” అని ఓ తండ్రి తీర్పు చిత్ర యూనిట్ తమ సంతాపం తెలియజేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యల పట్ల స్పందించి ఎదిరించిన ధీర వనిత.. స్ఫూర్తి ప్రదాత .. లయన్ శ్రీమతి ఆరిగపూడి కృష్ణకుమారి. అని నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి అన్నారు.
భర్త అడుగుజాడల్లో నడిచి ఆయన చేస్తున్న ప్రతి పనికి ఎంతో మమకారంతో తన సహకారాన్ని అందించిన నిజమైన సహధర్మచారిణి శ్రీమతి ఆరిగపూడి కృష్ణ కుమారి అని ప్రముఖ రచయిత రాజేంద్ర రాజు కాంచనపల్లి అన్నారు. “ఎంతోమందికి చేయూతనందించి ఆప్యాయత పంచిన ఆ మహాతల్లి మరణం తీరని లోటు ” అని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ నటులు వివ రెడ్డి అన్నారు.
“ఆవిడ భర్త లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ గారికి .. వారి పిల్లలకు భగవంతుడు ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాలని ” దర్శకులు ప్రతాప్ రెడ్డి, కెమెరామెన్ సురేష్, సీనియర్ నటులు కే.వి.యల్. నరసింహారావు, రాజేంద్ర కుమార్, సన్నీ కునాల్ రాజు, అనురాధ, కళింగ రంగనాథ్, ప్రముఖ రచయితలు బిక్కీ కృష్ణ,దాసరి వెంకటరమణ, నామాల రవీంద్ర సూరి, చైతన్య ప్రకాష్, సాధనాల వెంకటస్వామి నాయుడు, శ్రీమతి దేవకి దత్తి, మధు బాపు శాస్త్రి,రుద్రంగి రమేష్,మధు, అభిరామ్, రాపోలు దత్తాత్రి, లక్ష్మీనారాయణ, విశ్వనాధ్ , ఇప్పకాయల సతీష్, మంజుల,కె.వి నరసింహారాజు , బిల్డర్ కృష్ణ, యువరాజు,తదితర ఓ తండ్రి తీర్పు చిత్రం యూనిట్ సభ్యులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.