janavi kapoor latest news:బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తనదయిన స్టైల్లో అందాలను చూపి కుర్రకార్లను తన వైపు తిప్పుకొని చాలా దగ్గర ఇయ్యింది . అయితే ఆమె తెలుగు సినిమా ఛాన్స్ ఎప్పుడో రాగ ఆ తెలుగు సినిమాను ఇప్పటికీ ఓకే చేసింది. ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించకపోయినా జాన్వీకి టాలీవుడ్‌లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. 2018లోనే ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి.. తెలుగు చిత్రనిర్మాతలు ఆమెను టాలీవుడ్‌లో పరిచయం చేయడానికి తహతహలాడుతున్నారు. కానీ చివరికి దర్శకుడు కొరటాల శివ ఆమెను ఒప్పించగలిగారు. దీంతో ఆమె ‘NTR 30’లో జూ ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఒప్పుకుంది. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది.
మరో రెండు సినిమాలు
జాన్వీ త్వరలోనే మరో తెలుగు ప్రాజెక్ట్‌పై సైన్ చేయనుందని సమచాారం. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రానికి సంబంధించిన నిర్మాతలు అందులో జాన్వీని హీరోయిన్‌గా తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారట. దర్శకుడు బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ సరసన జాన్వీ కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను కూడా రాశారని తెలుస్తోంది. ప్రస్తుతం దీని కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆమె త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసే అవకాశం ఉంది.ఇంకా జాన్వికపూర్ తెలుగు ప్రజలకి ఇంకా దగ్గర అవ్వనుంది . ఇధి ఇలా వుండగా మరో వార్త చెక్కర్లు కొడుతుంది అధి ఏంటీ అంటే ..
అఖిల్‌తో
మరోవైపు జాన్వీ కపూర్‌ని మరో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సంప్రదించినట్లు సమాచారం. ఈ నిర్మాణ సంస్థ అఖిల్ అక్కినేనితో ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. అఖిల్‌కు వరుసగా ఫ్లాప్‌లు వస్తుండటంతో తర్వాతి సినిమాలో జాన్వీని తీసుకోవాలని అనుకుంటున్నారట.
అయితే ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు ఆమెకు ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనేది ఇంకా తెలియలేదు. అలాగే బిజీ షెడ్యూల్ దృష్ట్యా అఖిల్ సరసన నటించడానికి ఆమె అంగీకరిస్తుందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు.మొత్తం మీద జాన్వీ కపూర్ ప్రస్తుతం మరో రెండు తెలుగు చిత్రాలు సైన్ చేసేందుకు చర్చలు జరుపుతుందన్నమాట.