దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆడియో సంస్థ ‘లహరి మ్యూజిక్’ చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తుంది. ‘లహరి ఫిలిమ్స్ LLP’తోపేరుతో “వీనస్ ఎంటర్‌టైనర్స్‌తో కలిసి నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. పాన్-ఇండియా నటుడు, దర్శకుడు అయిన ఉపేంద్ర సహకారంతో రూపొందించనుంది.
లహరి మ్యూజిక్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి మనోహరన్ మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా సంగీత ప్రియుల కోసం పనిచేసిన తర్వాత మేము ఈ అసోసియేషన్ కోసం ఎదురుచూశాం. లహరి సంస్థ ఉపేంద్ర తొలి చిత్రం “A” నుండి మద్దతు ఇస్తోంది.ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు/ ఉపేంద్ర మాట్లాడుతూ, ఈ పాన్-ఇండియన్ చిత్రానికి పనిచేయడానికి నేను చాలా ఉత్సాహంగా వున్నాను. 33 ఏళ్లుగా “ఉపేంద్ర” కథను సృష్టించినా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాసిన అభిమానులే కారకులు. అందుకే ఈ చిత్రాన్ని భారతీయ సినీ అభిమానులకు `ప్రజా ప్రభు`గా అంకితం చేస్తున్నాను అన్నారు.