Politics ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రాజకీయాలపై మాట్లాడటానికి ఆయన అసలు ఆసక్తి చూపించలేదు..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం మీడియా ఇతన్ని చుట్టుమట్టింది పలు ప్రశ్నలు అడగగా ఆయన రాజకీయాలకు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
ప్రతి ఎన్నికల్లో కనిపించే రాజగోపాల్ రెడ్డి సాధారణంగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై సర్వే నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ విషయంపై ఖచ్చితంగా ఈయన చెప్పిందే నిజం అవుతూ వస్తుంది అలాగే ఈ సందర్భంగా కూడా రాజకీయాలపై పలు ప్రశ్నలు సంధిచారు మీడియా.. వచ్చే ఎన్నికల్లో నేపథ్యంలో ప్రశ్నలు అడగగా వాటిని దాటవేస్తూ వచ్చారు.. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుంది అని అతని అడగాల్సిన సమాధానం చెప్పకుండా దాటవేశారు.. అలాగే శ్రీవారిని దర్శించుకున్న వారిలో తిరుపతి లోక్‌సభ సభ్యుడు డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి, శాసన సభ్యుడు జ్యోతుల చంటిబాబు, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తెలంగాణ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఉన్నారు. విజయవాడ నుంచి తన స్నేహితులు, వారి కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనానికి వచ్చానని, ఈ ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నానని అన్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ బాగుండాలని కోరారు అందరికీ మంచి జరగాలని ఎప్పుడూ ఆ దేవుడిని ప్రార్థిస్తానని చెప్పుకొచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు సుఖంగా ఉండాలని అన్నారు..