Entertainment టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా మళ్లీ విడుదలకు సిద్ధమవుతుంది రేపు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రాబోతుంది ఈ సందర్భంగా ఇప్పటివరకు ఈ రీ రిలీజ్ సినిమాకు దక్కని అరుదైన గుర్తింపు ఈ సినిమాకి దక్కింది..
2001లో విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా అప్పట్లో అభిమానులు ఎంత కలర్ వచ్చిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నోసార్లు చూసినప్పటికీ మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన చూడటానికి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే ఈ సినిమాకు సంబంధించి టికెట్లు ఆన్లైన్ లో పెట్టగానే వెంటనే బుక్ అయిపోయాయి అంతేకాకుండా మొదటిసారి దేశంలోనే ఒక రీ రిలీజ్ చిత్రానికి బెనిఫిట్ షోను వేస్తున్నారు.. ఈ బెనిఫిట్ షోలు ఉదయం 5 గంటలకు, ఆరు గంటలకు చాలా చోట్ల వేస్తున్నారు. అవన్నీ దాదాపు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఏదైమైనా 21 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలవుతున్న ఈ సినిమా కొత్త రికార్డ్ లు క్రియేట్ చేయటం మామూలు విషయం కాదు. ఈ విషయం ఈ సినిమాకు సంబంధించి అర్ధమైన గౌరవం అనేది చెప్పాలి..
ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని అలరించింది.. ఇందులో పవన్ సరసన భూమిక చావ్లా నటించింది.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ఈ సినిమాను శ్రీసూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మించగా, ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాను ఆధునిక హంగులు జోడించి 4కె రిజర్వేషన్ తో మళ్ళీ విడుదల చేస్తున్నారు..