సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో నాగార్జున, కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు చిత్రం రాబోతోంది. బంగార్రాజు సినిమాను ప్రకటించిన క్షణం నుంచి మంచి బజ్ ఏర్పడింది. సోగ్గాడే చిన్న నాయన సినిమాలో బంగార్రాజు పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి కళ్యాణ్ కృష్ణ అద్బుతమైన కథతో రాబోతోన్నారు. ప్రీక్వెల్‌లో ఉన్నట్టుగానే నాగార్జున సరసన రమ్యకష్ణ నటించనున్నారు.
నాగార్జున, రమ్యకృష్ణలతో పాటుగా మరి కొన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలను కళ్యాణ్ కృష్ణ చూపించబోతోన్నారు. యువ సామ్రాట్ నాగ చైతన్య, కృతి శెట్టిలు మరో జోడిగా కనిపించబోతోన్నారు. కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాగ చైతన్య రివీల్ చేశారు. నాగలక్ష్మీ పాత్రలో కృతిశెట్టిని అందరికీ పరిచయం చేశారు.
బంగార్రాజు త్వరలోనే రాబోతోంది. లేడీస్ ఫస్ట్.. నాగలక్ష్మీ పాత్రలో కృతి శెట్టి అంటూ నాగ చైతన్య ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలిచనట్టుగా చేతిని ఊపుతూ నాగలక్ష్మీ కనిపిస్తున్నారు. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. పోస్టర్‌ను బట్టి చూస్తే కృతి శెట్టి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. నటీనటులందరి మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో బంగార్రాజు చిత్రం రాబోతోంది. సోగ్గాడే చిన్ని నాయన వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి ప్రీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశన్నంటాయి. పైగా నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
లడ్డుండా అనే పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. అనూప్ రూబెన్స్ అందించిన ఈ పాటకు విశేష స్పందన లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ
సాంకేతిక బృందం:
కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : అక్కినేని నాగార్జున
బ్యానర్స్ : జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే : సత్యానంద్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్