Kodali Nani Comments on Chandrababu & Lokesh Babu, AP Political News, AP POLITICS, Telugu World Now,
AP POLITICS: చంద్రబాబు క్యారెక్టర్ లెస్.. లోకేష్ బ్రెయిన్ లెస్ః మంత్రి కొడాలి ఫైర్
*- లోకేష్ కాదు.. బోకేష్..*
*పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ప్రెస్ మీట్ పాయింట్స్..*
*- వెయ్యి జన్మలెత్తినా.. క్యారెక్టర్ లో శ్రీ జగన్ చిటికెన వేలును కూడా బాబు, కొడుకు తాకలేరు*
*- వెన్నుపోటు పొడుస్తావనే… బాబు నిన్ను ఫాం హౌస్ లో పెట్టింది వాస్తవం కాదా లోకేష్..?*
*- ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటానికి కత్తి పట్టుకుని వెనుక తిరింగింది చంద్రబాబే కదా..?*
*- పప్పు-తుప్పు ఇంటికి, జూమ్ కే పరిమితమయ్యారు.. 2024లో రాష్ట్రం నుంచి శాశ్వతంగా చంద్రబాబును పంపిస్తారు*
*- శత్రువులతో సైతం శెభాష్ అనిపించుకుంటున్న గొప్ప వ్యక్తిత్వం శ్రీ జగన్ ది*
*- శ్రీ జగన్ క్రెడిబులిటీ తో రాజకీయాలు చేస్తుంటే… అడుక్కుతిని అయినా అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు లక్ష్యం*
*- ఇన్ పుట్ సబ్సిడీ, బీమా, జీరో వడ్డీ.. దాదాపు రూ.4 వేల కోట్లు చంద్రబాబు పెట్టిన బకాయిలు చెల్లించిన రైతు బాంధవుడు శ్రీ జగన్*
*- లోకేష్ కు ఇంట్లో తిండి పెట్టడం లేదు.. ఆ ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి వాగుడు వాగుతున్నాడు*
*- ఊక, ధాన్యానికి తేడా తెలియని దద్దమ్మ దేవినేని ఉమ.. ఉమను బట్టలూడదీసి కొడతామని ఆ నియోజకవర్గం మహిళలే చెప్పారు..*
*- శ్రీ జగన్ దమ్ము ఏంటో.. బాబు చూశాడు… మీరు సింహాలు కాదు.. వీధి కుక్కలు*
*- తుప్పు చిటికేసినా.. పప్పు తప్పెట్లు కొట్టినా.. శ్రీ జగన్ చిటికెన వేలు కూడా కదిలించలేరు.*
*- శ్రీ జగన్ చిటికె వేయాల్సిన అవసరం లేదు.. నోటికొచ్చినట్లు మాట్లాడితే వైయస్ఆర్సీపీ అభిమానులే బడిత పూజ చేస్తారు*
——————-
రాజకీయాల్లో విశ్వసనీయతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, క్రెడిబులిటీతో కూడిన రాజకీయాలను ముఖ్యమంత్రి శ్రీ జగన్ చేస్తుంటే.. అడుక్కుతినైనా, అడ్డదారిలో అయినా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చూస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) మండిపడ్డారు. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదు.. లోకేష్ కు బ్రెయిన్ లేదు అని ఘాటుగా విమర్శించారు. తండ్రీకొడుకులు వెయ్యి జన్మలెత్తినా.. క్యారెక్టర్ లో శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారికి సాటి రారని, ఆయన చిటికెన వేలును కూడా తాకలేరు అన్నారు.
“ఈమధ్య కాలంలో లోకేష్ కు ఇంట్లో తిండి పెట్టడం లేదు.. ఆ ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి వాగుడు వాగుతున్నాడు. తండ్రీకొడుకులు కూడా వేర్వేరు చోట ఉంటున్నారు. తాను ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్టు.. తనకు తన కొడుకు ఎక్కడ వెన్నుపోటు పొడుస్తాడనే భయంతోనే లోకేష్ ను చంద్రబాబు ఫాం హోస్ లో పెట్టింది నిజం కాదా..” అని కొడాలి నాని ప్రశ్నించారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ నేను ఉన్నాను అనే భరోసా ఇస్తూ.. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, శత్రువులతో సైతం శెభాష్ అనిపించుకుంటున్న గొప్ప వ్యక్తిత్వం శ్రీ జగన్ మోహన్ రెడ్డిదని మంత్రి కొడాలి అన్నారు. జగన్ మోహన్ రెడ్డిగారి దమ్ము ఏంటో.. చంద్రబాబుకు బాగా తెలుసు అని, అందుకే ఆయన ఇంటికి- జూమ్ కి పరిమితమయ్యారని విమర్శించారు. 2024లో రాష్ట్రం నుంచి చంద్రబాబును శాశ్వతంగా ప్రజలు పంపిస్తారని చెప్పారు. రైతులపై లేని ప్రేమను కనబరుస్తూ, పేజీలకు పేజీలు పనికిమాలిన లేఖలు రాస్తున్నాడని చంద్రబాబుపై మంత్రి ధ్వజమెత్తారు. రుణ మాఫీ పేరుతో కోటి మంది రైతులను మోసం చేసి, చంద్రబాబు పంగనామాలు పెడితే.. ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా, జీరో వడ్డీలకు సంబంధించి, దాదాపు రూ.4 వేల కోట్లు బకాయిలు పెట్టి దిగిపోతే, వాటిని చెల్లించిన రైతు బాంధవుడు శ్రీ జగన్ అని కొడాలి నాని అన్నారు.
*మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..*
1. రైతులకు గత ప్రభుత్వాలు మోసం చేసినట్లు కాకుండా ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కూడా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే చెల్లింపులు చేసింది. రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయిన చంద్రబాబు నాయుడు … పేజీలకు పేజీలు ముఖ్యమంత్రికి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమై, అప్పటి నుంచి ఇంటికి, జూమ్ కే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు.
2. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారికి చంద్రబాబు ఓ లేఖ రాశాడు. నేను అయితే 48 గంటల్లో డబ్బులు ఇచ్చేవాడిని అని, మీరు నెలరోజులు అయినా కూడా బాకీలు చెల్లించకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. తక్షణమే చెల్లించాలంటూ ఓ పిచ్చి కాగితం రాసి మీడియాకు విడుదల చేశాడు. చంద్రబాబూ.. అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అసలు మనిషివా.. లేక…? టీడీపీ హయాంలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం కొనుగోళ్ల బకాయిలను మేము అధికారంలోకి వచ్చాక రూ.996 కోట్లు చెల్లించాం. అలానే, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట బీమా, జీరో పర్సెంట్ వడ్డీకి సంబంధించిన దాదాపు 4వేలు కోట్ల రూపాయిలు, చంద్రబాబు 2017 నుంచి 2019 వరకు రైతులకు బకాయిలు పెడితే, వాటిని 2019లోనే అధికారం చేపట్టిన మూడు నెలల్లో చెల్లించిన రైతు బాంధవుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిగారు. అలాంటి వ్యక్తిపై విషం కక్కుతున్నావా?
3. 87వేల కోట్ల రూపాయిలు రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి… తాకట్టు పెట్టిన మీ భార్యల మెడల్లోని బంగారు మంగళసూత్రాలు తిరిగి తెప్పిస్తానని చెప్పి, కోటయ్య కమిటీ వేసి, కోటి మంది రైతులను మోసం చేసి రైతులకు పంగనామాలు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాళ్వా సీజన్‌లో సివిల్ సప్లయ్, సెంట్రల్ వేర్ హౌస్ శాఖల నుంచి… 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులు ధాన్యం ఇచ్చిన 21 రోజుల లోపు డబ్బులు చెల్లిస్తామని మొదటి నుంచీ చెప్పాం. ఈ ప్రభుత్వం కొన్న ధాన్యానికి 21 రోజుల్లోపలే రూ. 1637 కోట్ల రూపాయిలు రైతులకు చెల్లించాం. మరో రూ.1619కోట్లు ఇంకా రైతులకు ఇవ్వాలి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా … రాష్ట్ర ఖజానా నుంచి రైతులకు చెల్లిస్తున్నాం. ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయం. తనను ఎక్కడ జైలులో వేస్తారేమో అని. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో పౌరసరఫరాల శాఖకు కేంద్రం ఇవ్వాల్సిన రూ. 3200 కోట్ల బకాయిలును తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రతిపక్ష నేతకు ఈవేమీ కనిపించవు. వీటన్నింటిని గాలికి వదిలేసి ఎంతసేపటికీ శ్రీ వైఎస్ జగన్‌పై బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దాళ్వా సీజన్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని అనుకున్నాం. అయితే అధిక వర్షాలు పడటం వల్ల అది 40 లక్షలే వస్తుందని అంచనా. మిల్లర్లు కొనకపోయినా.. ఎవరు సహకరించినా, సహకరించకపోయినా ఆర్బీకే సెంటర్ల ద్వారా ప్రతి గింజ కొనమని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు.
4. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడు. కరోనా వచ్చింది కాబట్టి హైదరాబాద్‌లోనే దాక్కుంటాడు. ఇక్కడ ఉన్న దేవినేని ఉమా లాంటి సన్నాసులు, పోరంబోకులు నోటికొచ్చిన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఊకకు, ధాన్యానికి తేడా తెలియని దద్దమ్మ దేవినేని ఉమ. ఊక బస్తాలు ముందు పెట్టుకుని కొంతమంది రైతులు చెప్పినా వినకుండా హడావుడి చేశాడు. ఊకను ఎక్కడైనా సివిల్ సప్లయ్ శాఖ కొంటుందా.. అది కూడా తెలియదా ఉమా?
– అతని నియోజకవర్గంలోనే… మహిళలు దగ్గరకు వెళ్లి చెప్పండమ్మా… చెప్పండమ్మా అంటే… ఉమాగాడు ఇక్కడకు వస్తే బట్టలూడదీసి కొడతామని… చెప్పించుకునే పరిస్థితి ఎదురైంది. మాస్క్ పెట్టుకున్నాడు కనక బతికిపోయాడు. మాస్క్ లేకుంటే బట్టలు ఊడదీసి కొట్టేవాళ్లు ఈ సన్నాసి ఉమాని. చంద్రబాబు నాయుడులాంటి ద్రోహులు, వెన్నుపోటుదారులు, నీచుల వద్ద నుంచి ఈ ప్రభుత్వం నీతులు చెప్పించుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిది.
5. పప్పు లోకేష్ కు… ఈ మధ్య ఇంట్లో తిండి పెట్టడం లేదేమో అందుకే ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు. “.. ఇలా పెరిగావు, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచి చావలేదని ఇంట్లో తిండి పెట్టడం లేదేమో..” అందుకే ఆ అసహనంతో ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చిటికె వేస్తే జగన్‌మోహన్‌రెడ్డిగారిని తిరగనిచ్చేవాడు కాదట. “తుప్పు చిటికె వేసినా… పప్పు తప్పెట్లు కొట్టినా.. జగన్ వేలు మీద వెంట్రుక కూడా పీకలేరు..”
6. చంద్రబాబు ఊరంతా నీతులు చెబుతాడు. కొడుకు లోకేష్ ని అచ్చోసిన ఆంబోతులా వదిలాడు. ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు, వీడు.. మగాడివి అయితే.. సీబీఐ ఎంక్వైరీ వెయ్ అని మాట్లాడతాడా. శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు అంశాల్లో సీబీఐ విచారణ వేయమని కేంద్రాన్నికోరారు. మరి మీ నాన్న చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, సీబీఐ విచారణ వేయమని ఒక్కటైనా అడిగాడా? అదే సీబీఐని రాష్ట్రాంలోకి అడుగుపెట్టకూడదని చట్టం తెచ్చినవాడు చంద్రబాబు.
7. జగన్‌మోహన్‌రెడ్డి గారి దమ్ము లోకేష్ చూసేదేంటి..? ఇప్పటికే చంద్రబాబు చూశాడు. అందుకే ఇంట్లో పడుకున్నాడు. సిగ్గు, శరం లేదు ఇద్దరికీ. నన్ను బూతుల మంత్రి అని అంటున్నారు. మీరు ఇష్టం వచ్చినట్లు అనుకోండి. మా జగన్‌మోహన్‌రెడ్డిగారిని వాడు, వీడు అని సంబోధిస్తే… . “తుప్పు నాయుడు.. లోకేష్ కాదు బోకేష్ అంటాం. పిచ్చివాగుడు వాగితే తాట తీస్తాం.. అధికారంలో ఉన్నా, లేకపోయినా వైఎస్ జగన్‌ను.. ముఖ్యమంత్రిగా కాదుకదా… ఓ వ్యక్తిగా కూడా మీరు తాకలేరు. ఆయనకు ఉన్న నిగ్రహ శక్తి, ప్రజా బలం, మంచితనం ముందు ఆయనను… మీరిద్దరు వెయ్యి జన్మలు ఎత్తినా తాకలేరు. ఆయన చిటికెనవేలు కూడా తాకలేరు.. ”
8. రోడ్డు మీదకు వచ్చి బురద రాసుకున్న పందుల్లా మాట్లాడితే… తండ్రీకొడుకుల ఇద్దరి బట్టలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం. నిన్న లోకేష్ అంటున్నాడు కత్తితో తిరిగే వాడు కత్తితో పోతాడు అని… కత్తితో తిరిగేది ఎవరు.. ఎన్టీ రామారావు వెనుక కత్తితో తిరిగింది బాబు కాదా? ఇప్పుడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించి ఫాం హౌస్‌లో పెట్టించాడు. సొంత మామను బాబు వెన్నుపోటు పొడిస్తే… ఇప్పుడు నీవు ఎక్కడ వెన్నుపోటు పొడుస్తావనే భయంతో నిన్ను ఫాం హౌస్‌లో పెట్టంది వాస్తవం కాదా…?
– చరిత్ర గురించి మాట్లాడుకుంటే.. మీ కుటుంబం చరిత్ర, మీ చరిత్ర, చంద్రబాబు చరిత్ర.. అందరి గురించి చర్చ పెట్టుకుందాం. వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తాం.
9. మీ వాగుడు ఇలాగే ఉంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారు చిటికెలు వేయాల్సిన పనిలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే మీకు దేహశుద్ది చేస్తారు. పిచ్చివాగుడు వాగకుండా బడితపూజ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు సింహాలు కాదు.. వీధి కుక్కలు… అందుకే వీధుల్లో మొరుగుతున్నారు.
*లోకేష్ కాదు బోకేష్, బ్రెయిన్ లెస్…*
10. టీడీపీ హయాంలో, 14 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉండగా, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీకి చెందిన కార్యకర్తలు చనిపోలేదా? వీటన్నింటికి చంద్రబాబే బాధ్యత వహిస్తాడా? గ్రామాల్లో ఉన్న రాజకీయాల్లో ముఖ్యమంత్రులకు, పార్టీలకు సంబంధం లేకుండానే కొన్ని హత్యలు, గొడవలు జరుగుతాయి. గ్రామస్థాయిలో జరిగిన హత్యలను ముఖ్యమంత్రికి ఆపాదించడం ఎంతవరకు సబబు.
– చంద్రబాబులా వైఎస్ జగన్‌గారు హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం లేదు. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చిత్తశుద్ధితో పని చేస్తున్నారు కాబట్టే ఈ పప్పు… తుప్పు రోడ్లమీద పడి పిచ్చికుక్కల్లా తిరుగుతున్నారు.
11. చంద్రబాబు, లోకేష్.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు … వీరంతా ఎట్టిపరిస్థితుల్లో వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిగారిని వెంటనే అధికారంలో నుంచి దించేసి చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలి అని ఆరాటపడుతున్నారు. వారికి జగన్‌మోహన్‌రెడ్డిగారు శ్రీరామ అన్నా బూతుమాట లానే వినిపిస్తుంది. మంగళగిరిలో గెలవలేని చవట.. దద్దమ్మ కోటలో ఉన్నా ఒకటే.. పేటలో ఉన్నా ఒకటే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా గెలవలేనివాడు .. జీవితంలో ఎమ్మెల్యే అవ్వగలడా? అందుకే దొడ్డిదారిన అధికారంలోకి వచ్చాడు.
12. శత్రువులతో కూడా శెభాష్ అనిపించుకునే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు జగన్‌గారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఏదైతే మనం చేయగలమో అదే చెబుదాం. దాన్నేచేద్దాం.. అనేది జగన్ గారి ఆలోచన. నిజం నిప్పులాంటిది … రేపు అయినా తెలుస్తుంది. రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి కాదు… క్రెడిబులిటీని సంపాదించుకోవడమే ముఖ్యం. క్రెడిబులిటీకి మించిన ఆస్తి లేదని జగన్‌మోహన్‌రెడ్డిగారు ఎప్పుడూ చెబుతారు. జగన్ గారు ఒకమాట చెప్పాడంటే ఎంత కష్టమైనా ఆ మాట నెరవేర్చుతారు. తన తండ్రికి ఉన్న ఆ ఆస్తి(క్రెడిబులిటీ) తనను ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకువచ్చిందని, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఒక్క అబద్ధం కూడా చెప్పడానికి వీలు లేదనేది జగన్ గారి ఉద్దేశం. 2024లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా ఇంటికి పంపిస్తారు.